BigTV English

Indiramma Housing Scheme Latest: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లేటెస్ట్.. లబ్ధిదారుల జాబితాలు సిద్ధం!

Indiramma Housing Scheme Latest: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లేటెస్ట్.. లబ్ధిదారుల జాబితాలు సిద్ధం!

Indiramma Housing Scheme Latest: ఇందిరమ్మ ఇళ్లపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. మే(ఈ నెల) చివరవారంలో లబ్దిదారులు గృహ ప్రవేశం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇకపై రెండో విడతపై ఫోకస్ చేసింది. లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రావడంతో జాబితాను రెడీ చేస్తున్నారు. రెండో విడత కింద 2 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.


మే నెలాఖరుకు ఇందిరమ్మ గృహ ప్రవేశాలు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి. జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 20 వేల ఇళ్ల నిర్మాణం బేస్​మెంట్ పనులు మొదలు అయ్యాయి. 5 వేల మంది బేస్‌మెంట్ పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి లక్ష ఆర్థిక సాయం అందుకొని గోడలు నిర్మిస్తున్నారు కూడా.

ప్రతి సోమవారం బేస్​మెంట్ పూర్తి చేసినవారి ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల బేస్‌మెంట్ పూర్తి చేస్తున్న లబ్ధిదారులకు ప్రతీ సోమవారం తొలి దశ సాయం అందచేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. అందుకు అనుగుణంగా ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు తొలి దశ సాయాన్ని జమ చేస్తున్నారు అధికారులు. మే నెల చివరలో సీఎం చేతుల మీదుగా గృహప్రవేశం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఇదిలాఉండగా సోమవారం నుంచి రెండో విడత లబ్ధిదారులకు ఇళ్ల మంజూరుపై దృష్టి పెట్టారు అధికారులు. ఈ విడతలో 2 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఆలోచన చేస్తోంది.  లబ్ధిదారుల ఎంపిక శనివారంతో ముగిసింది. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 4 లక్షల 16 వేలు మందిని ఎంపిక చేయాల్సివుంది.

ALSO READ: ఎయిర్‌పోర్టులో కేఏపాల్.. అడ్డుకున్నారంటూ హంగామా

33 వేల ఇళ్లను సీఎం విచక్షణాధికారం కింద కేటాయించారు అధికారులు. అందులో 25 వేలు మూసీ నిర్వాసితులకు అందజేయనున్నారు. తొలి దశలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు అధికారులు. ఇప్పుడు మిగతా గ్రామాల్లో రెండో దశ లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు.

అందులో 1.05 లక్షల మంది లబ్దిదారులకు సంబంధించి సర్వే పూర్తి చేసిన జాబితాను కలెక్టర్లకు పంపించారు ఎంపీడీవోలు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆమోదించగానే సోమవారం(ఈనెల 12) నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అనర్హులను జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది కూడా.

ఇందిరమ్మ ఇళ్లకు అన‌ర్హుల‌ని తేలితే నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వం నుంచి సాయం అందింతే వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తానికి లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు.

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×