BigTV English
Advertisement

Love Stories In Bigg Boss : బిగ్ బాస్ లో చీకటి ప్రేమలు..అర్ధరాత్రి ఆ పనిచేస్తూ దొరికిన కంటెస్టెంట్స్..

Love Stories In Bigg Boss : బిగ్ బాస్ లో చీకటి ప్రేమలు..అర్ధరాత్రి ఆ పనిచేస్తూ దొరికిన కంటెస్టెంట్స్..

Love Stories In Bigg Boss: వరల్డ్ టాప్ మోస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ షో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది అని తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో ప్రతి ఏడాది, ప్రతి ఇండస్ట్రీలో ను జరుగుతుంది. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 ప్రసారం అవుతుంది. ఈ సీజన్ లో వైల్డ్ కార్డు లు ఎంట్రీ ఇచ్చిన తర్వాతే హౌస్ లో కంటెస్టెంట్స్ గేమ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిదోవ వారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్ పై ఆసక్తికరంగా మారింది. ఇక బిగ్ బాస్ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే ప్రతి సీజనలోనూ హౌస్ లో కొందరి మధ్య ప్రేమలు, చీకటి బాగోతాలు కూడా జరుగుతున్నాయి. అయితే బిగ్ బాస్ లో ఇప్పటివరకు ప్రేమ జంటలు అని పేరు అందుకున్న జంటలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ హౌస్ లో మొదటి రెండు సీజన్లు పెద్దగా ప్రేమ వ్యవహారాలు జరిగినట్లు కనిపించలేదు. మూడో సీజన్ బిగ్ బాస్ ఫ్లాన్ మార్చింది. హౌస్ లో ఆటలతో పాటుగా గిల్లికాజ్జాలు కూడా ఉంటే బాగుండు అని పక్కా ప్లాన్ ప్రకారమే ప్రేమ అనే ట్యాగ్ ను కొన్ని జంటలకు తగిలించారు. ఇంతకీ ఏ సీజన్ లో ఎవరు లవ్ బర్డ్స్ అనే ట్యాగ్ ను తగిలించుకున్నారో ఒకసారి తెలుసుకుందాం..

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో రాహుల్ సిబ్లిగంజ్- పునర్నవి మధ్య సాగిన రొమాన్స్ ఇప్పటికి చర్చనీయాంశంగా మారింది. వారి లవ్ స్టోరీ కోసమే ఆ సీజన్ చూశారంటే అతిశయోక్తి కాదు, ఈ జంటపై బిబి ఆడియన్స్ లో ఓ పాజిటివ్ టాక్ ఉంది. హద్దులు దాటకుండా సాగిన వీరి ప్రియమైన సీజన్ 3కి హైలెట్.. బయట కూడా ఇదే టాక్ నడిచింది. ఇప్పుడు వీరి పేర్లు వినిపించలేదు..


బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్, మోనాల్ మధ్య ఎలాంటి రొమాన్స్ జరిగిందో మనం చూసాము.. అర్థ రాత్రి హౌస్ లో వీళ్ళు చేస్తున్న రొమాన్స్ ఎంతగా హైలెట్ అయ్యిందో తెలిసిందే.. వారు ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు. ప్రతి టాస్క్ లోను ఒకరిపై ఒకరు ఇష్టాన్ని కనబరిచే వాళ్ళు.. ఇక అదే సీజన్లో అభిజిత్ – హారిక అలేఖ్య మధ్య కూడా లవ్ స్టోరీ సాగినట్లు ప్రచారం జరిగింది. వీరిద్దరూ సన్నిహితంగా ఉండటంతో బిగ్ బాస్ లవ్ బర్డ్స్ అనే ముద్ర కూడా వేశారు.

ఇక సీజన్ 4 లో షణ్ముఖ్-సిరి ల మధ్య లవ్ ట్రాక్ కొనసాగింది. వీరిద్దరూ ఎంత గొడవ పడిన మరుక్షణం కలిసి పోయేవారు. వీరి గిల్లికజ్జాలు, రొమాంటిక్ మూమెంట్స్ ఆనాటి సీజన్ కు హైలెట్ అవ్వడంతో పాటుగా, హాట్ టాపిక్ అయ్యాయి.

బిగ్ బాస్ సీజన్ 6 లో  ఇనయ సుల్తానా రూటే సపరేటు. ఏకంగా కంప్రెషన్ రూమ్ లోకి వెళ్లి.. ఆర్ జె సూర్య అంటే తనకి ఇష్టం అంటూ వెల్లడించి అందరిని షాక్ గురి చేసింది. సూర్య ఎలిమినేట్ అయ్యాక ఎంత బాధపడిందో ఇప్పటికి అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది.

ఇక సీజన్ 7 లో కేవలం పులిహోర మాత్రమే కనిపించింది. పల్లవి ప్రశాంత్, రతికా ల మధ్య మొదట్లో ట్రాక్ నడిచిన ఆ తర్వాత ఆమె మోసం తెలుసుకొని అక్కా అని అనడంతో గొడవలు తప్ప లవ్ ట్రాక్ లు లేవనే చెప్పాలి.

ఇక ఇప్పుడు ప్రసారం అవుతున్న సీజన్ లో మాత్రం వారం వారం ఫెయిర్స్ పెరుగుతున్నారు. మొదటి సోనియా, పృథ్వి, నిఖిల్ మధ్య ఎదో ఉందని అనుకున్నారు. ఆ తర్వాత పృథ్వి విష్ణుప్రియ ల మధ్య ఏదో తెలియని ట్రాక్ మాత్రం నడుస్తోంది. విష్ణుప్రియ మొదటి నుండి పృథ్విరాజ్ అంటే ఆసక్తి చూపుతోంది.. ఇప్పుడు నిఖిల్, యష్మీ లవ్ ట్రాక్.. మొత్తంగా ప్రతి సీజన్ లో లవ్ బర్డ్స్ వల్ల మంచి కంటెంట్ దొరికిందనే చెప్పాలి.

Related News

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Bigg Boss: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Bigg Boss 9: పాపం ఒంటరైన సంజన.. పేరుకే అమ్మా.. ఏంటి ఇమ్మాన్యుయేల్ ఇది

Bigg Boss 9 Day 58: హౌజ్ లో ఇద్దరు రెబల్స్.. పక్కనే ఉంటూ వెన్నుపోటు.. బలైన కళ్యాణ్, మళ్లీ ఒంటరైన సంజన

Bigg Boss 9: నాన్న పోయి తమ్ముడచ్చాడు.. తనూజకి కొత్త బాండింగ్ దొరికిందోచ్

Big Stories

×