BigTV English

Bigg Boss Telugu 8 : అరె ఏంట్రా ఇది.. ఎవరిని వదలవా.. నిన్న హాగ్, నేడు కిస్..

Bigg Boss Telugu 8 : అరె ఏంట్రా ఇది.. ఎవరిని వదలవా.. నిన్న హాగ్, నేడు కిస్..

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది.. టాస్క్ లు ఆడటం మానేసి రొమాన్స్ కోసం పరితపించే స్థాయికి కంటెస్టెంట్స్ వెళ్తున్నారు. ఒకవైపు ట్రాయాంగిల్ స్టోరీ లు.. మరోవైపు అందినకాడికి దోచుకో అన్నట్లు హౌస్ మెట్స్ ప్రవర్తిస్తున్నారు. రాను రాను బిగ్ బాస్ షో బూతు సినిమా లాగా మారుతుందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్న నాగ్ మరియు బిగ్ బాస్ నిర్వాహకులు మౌనంగా ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు నా బూతో నా భవిష్యత్ అన్నట్లు తయారైంది. నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠ చేసిన పనికి జనాలు షాక్ అవుతున్నారు.. మరోవైపు పెళ్ళాం వదిలేసింది కదా ఇలా కానిస్తున్నాడేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక నిన్నటీ ఎపిసోడ్ హైలెట్స్ ను ఒకసారి చూసేద్దాం..


గత రెండు వారాలకు భిన్నంగా ఈ వీక్ నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. గుడ్డు కోసం, దాని ఈకల కోసం అంటూ సిల్లీ రీజన్స్ చెప్పకుండా కరెక్ట్ పాయింట్ చెప్పి నామినేట్ చేశారు. రెండు వారాల పాటు నామినేషన్స్ తప్పించుకున్న యష్మీ గౌడ .. తొలిసారిగా నామినేషన్‌లోకి రావడం విశేషం.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ఆమె ఇలాంటి టార్గెట్ అవ్వడం ఆమె ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదని తెలుస్తుంది. నిఖిల్, అభయ్ నవీన్ తప్ప మిగిలిన అందరు నామినేషన్స్ లో ఉన్నారు. అయితే తాజాగా మణికంఠ గురించి సంచలన నిజం ఒకటి బయట పడింది.. నామినేషన్ నుంచి బయట పడేందుకు హౌస్ లోని అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నాడని తెలుస్తుంది. నిన్న యష్మీని హగ్ చేసుకున్నాడు. నేడు సోనియాను కిస్ చేశాడు.. ఇతనిపై ట్రోలింగ్ మొదలైంది..

Manikantha who kissed Sonia.. Netizens are terrible trolls
Manikantha who kissed Sonia.. Netizens are terrible trolls

మణికంఠ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో.. అదీ నామినేషన్స్ రోజున విపరీతంగా ఏడ్చేసి.. బిగ్ బాస్ కూడా ఎమోషనల్ అయ్యేలా చేసేశాడు. సింపతీ కోసమానుకోవాలో ఏమో కానీ తన జీవితంలో పడ్డ కష్టాల గురించిచెప్పి అందరిలో సింపతీ సంపాదించాడు. కానీ ఇప్పుడు ఆటలో యాక్టివ్ గా ఉన్నాడు. మరోవైపు అమ్మాయిలతో పులిహోర కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా అతనిలో చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి.ఏదేమైనా మొదటి వారంతో పోలిస్తే అతను కొంచెం స్ట్రాంగ్ అయినట్టే కనిపిస్తున్నాడు. నిన్న నామినేషన్ తర్వాత అతను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇక నిన్న ఎపిసోడ్ లో సోనియా పాట పాడుతున్న టైంలో వెళ్లి గట్టిగా పట్టుకుని కిస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇది చూసిన కొంతమంది నెటిజన్లు .. అరేయ్ మణికంఠ బాగా మారిపోయావురా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓ సారి చూసేయ్యండి. ఇక ఈ వారం నామినేషన్స్ మాములుగా లేవు.. హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్తారా అనే ఉత్కంట జనాల్లో మొదలైంది. బిగ్ బాస్ జనాల్లో ఆసక్తిని అలాగే కొనసాగించేందుకు కొత్త కొత్త టాస్క్ లను ఇస్తున్నాడు. ఈ వారం అయితే మణికంఠ వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే..


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×