E-Paper
Advertisement

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా ఉండటం అసలు ఇష్టం లేదు.. సీజన్ 10 కి నాగార్జున ఉండరా?

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా ఉండటం అసలు ఇష్టం లేదు.. సీజన్ 10 కి నాగార్జున ఉండరా?
Advertisement

Bigg Boss Telugu: బిగ్ బాస్ ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు హిందీలో మాత్రమే ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం అనంతరం తెలుగు తమిళ కన్నడ భాషలలో కూడా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో ఈ కార్యక్రమం విషయానికి వస్తే ప్రస్తుతం 9వ సీజన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మరొక రెండు వారాలలో ఈ తొమ్మిదవ సీజన్ కూడా పూర్తి కానుంది. ఇక ఈ సీజన్ లో విన్నర్ ఎవరు అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున(Nagarjuna) ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బిగ్ బాగ్ ఇష్టం లేదు..కానీ..

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున బిగ్ బాస్ (Bigg Boss Host)కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నిజానికి తాను బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదని తెలిపారు. అయితే సీజన్ 3 కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించిన తర్వాత బిగ్ బాస్ ఒక వ్యసనంలా మారిపోయింది అంటూ నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమం మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించగా రెండవ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

వ్యసనంలా మారిన బిగ్ బాస్…

Advertisement

ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు నాగార్జున హోస్ట్ గా తప్పుకుంటున్నారు అంటూ ఎంతో మంది హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి కానీ నాగార్జున మాత్రం ఈ కార్యక్రమానికి హోస్ట్ గా కొనసాగుతున్నారు. ఇక తాజాగా ఈయన బిగ్ బాస్ తనకు వ్యసనంలా మారిపోయిందని చెప్పడంతో ఇకపై రాబోయే సీజన్లకు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని స్పష్టం అయింది. ఇక నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తూ ఒక సినిమా చేసిన దానికంటే కూడా అధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

కింగ్ 100 వ సినిమా..

Advertisement

బిగ్ బాస్ హోస్ట్ గా, మరోవైపు నటుడిగా నాగార్జున కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన త్వరలోనే తన 100వ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఇక ఈయన ఇటీవల ధనుష్ హీరోగా నటించిన కుబేర సినిమాతో పాటు రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కూలి సినిమాలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా ఒకవైపు సినిమాలలో క్యామియో రోల్స్ చేస్తూనే మరోవైపు హీరోగా కూడా కొనసాగుతున్నారు. నాగార్జున త్వరలోనే తన 100వ సినిమాను ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నాగార్జున కెరియర్ లోనే ఎంతో కీలకమైనది కావడంతో ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Also Read: Psych siddhartha release: అఖండ 2 ఎఫెక్ట్.. కొత్త విడుదల తేదీని ప్రకటించిన నందు సైక్ సిద్ధార్థ్..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×