BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu Elimination: గంగవ్వ గేమ్స్ ఆడలేదు.. వెళ్లిపోయే ముందు నయని పావని ఓపెన్ కామెంట్స్, వారిపై కూడా..

Bigg Boss 8 Telugu Elimination: గంగవ్వ గేమ్స్ ఆడలేదు.. వెళ్లిపోయే ముందు నయని పావని ఓపెన్ కామెంట్స్, వారిపై కూడా..

Bigg Boss 8 Telugu Elimination: బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంటర్ అయ్యింది నయని పావని. బిగ్ బాస్ సీజన్ 7లో కూడా తను వైల్డ్ కార్డ్ ఎంట్రీగానే వచ్చింది. కానీ గత సీజన్‌లో కేవలం వారం రోజులు మాత్రమే ఉండి ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయినా కూడా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా చాలామంది ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఇక ఈసారి మాత్రం ఏకంగా నాలుగు వారాలు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగింది. ఫైనల్‌గా తాజాగా జరిగిన ఎలిమినేషన్‌లో ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయింది. వెళ్లే ముందు కంటెస్టెంట్స్ అందరిపై తనకు ఉన్న అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పేసింది నయని పావని.


గంగవ్వ గురించి చెప్పిందంతా నిజమే

ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌లో బెస్ట్, వేస్ట్‌ను సెలక్ట్ చేయమన్నారు నాగార్జున. అయితే తను ఆలోచించకుండా ముందుగా గంగవ్వ పేరే చెప్పింది. తన వయసు సహకరించదు కాబట్టి తను గేమ్స్‌లో పాల్గొనలేదు అని తనను వేస్ట్ కేటగిరిలో వేసేసింది. ఇది విన్న ప్రేక్షకులు సైతం నిజమే అని ఫీలయ్యారు. గంగవ్వ గేమ్స్ ఆడడం లేదు, టాస్కుల్లో తన వయసు సహకరించదు, అప్పుడప్పుడు ఇతర కంటెస్టెంట్స్‌తో దురుసుగా ప్రవర్తిస్తుంది. అయినా కూడా తనను ఎవరూ ఏమనకపోవడం, నామినేట్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కానీ నయని పావని మాత్రం వెళ్లిపోయే ముందు కరెక్ట్ మాట చెప్పిందని ఆడియన్స్ అనుకుంటున్నారు.


Also Read: బిగ్ బాస్ నుంచి నయని అవుట్.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందంటే?

వెనక మాట్లాడొద్దు

రోహిణి కూడా వరస్ట్ కేటగిరిలోనే పడేసింది నయని పావని. గతవారంలో జరిగిన టాస్కుల్లో ఇద్దరూ ఒకే టీమ్‌లో ఉన్నారు. అయినా కూడా రోహిని తనకు సపోర్ట్ చేయలేదని నయని ఏడ్చింది. అలా ఏడవడం రోహిణికి నచ్చలేదు. అలా వెనక మాట్లాడడం కరెక్ట్ కాదని, టాస్కుల విషయంలో తను ఇంకా వీక్ అని రోహిణి గురించి స్టేట్‌మెంట్ ఇచ్చింది నయని పావని. ఇక ప్రేరణకు, నయనికి కూడా అంత మంచి సాన్నిహిత్యం లేదు. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య చాలానే గొడవలు జరిగాయి. అందుకే కోపంలో ఉన్నప్పుడు మాటలు ఆలోచించి మాట్లాడమని చెప్పింది నయని. మనం ఏది ఇస్తే అదే తిరిగొస్తుందని, అందుకే ఆలోచించి మాట్లాడు, ఆలోచించి ప్రవర్తించు అంటూ గౌతమ్‌కు సలహా ఇచ్చింది.

తనొక్కడే నిజాయితీపరుడు

తన దృష్టిలో బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అని అడగగా.. ముందుగా హరితేజ పేరు చెప్పింది నయని పావని. తనలో చాలా ఫైర్ ఉందని, అది నమ్మి ముందుకెళ్లమని తెలిపింది. తర్వాత నిఖిల్ పేరు చెప్పింది. బయటికి కోపంగా కనిపించినా, నిఖిల్ చిన్నపిల్లాడి లాంటి వాడని స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఏదైనా ఉంటే ఓపెన్‌గా చెప్పమని సలహా ఇచ్చింది. పృథ్వి గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్‌లో పృథ్వి అంత నిజాయితీగా ఎవరూ లేరని చెప్పింది నయని పావని. తన ఆట చాలా బాగుంటుందని చెప్పింది. అలా బిగ్ బాస్‌ను వదిలి వెళ్లిపోయింది నయని పావని. ఈమధ్య తరచుగా ఏడుస్తూ ఉండడంతో నయని వెళ్లడమే మంచిదని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Bigg Boss 9 Telugu : భరణిని బయటకు గెంటే గోల్డెన్ ఛాన్స్ మిస్… ఇంకా నాన్న మీద హోప్స్ ఉన్నాయా పాపా?

Bigg Boss 9 : తనుజ దొంగ గేమ్, అదే తప్పు ఇంకొకరు చేస్తే వదిలేస్తారా? 

Bigg Boss 9 : పాపం భరణికి ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు, తనను చూసి నేర్చుకోవాల్సింది ఇదే

Bigg Boss 9 Telugu: టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పిన ఇమ్మానుయేల్ బ్రదర్.. చాలా బాధగా ఉందంటూ!

Bigg Boss 9 Telugu Day 63 : దివ్యకు నాగార్జున మాస్ వార్నింగ్… వీడియోలతో బండారం బట్టబయలు… తనూజా చేతుల్లో ఎలిమినేషన్

Bigg Boss 9 Promo: రీతూ చౌదరి టాలెంట్ అదుర్స్.. అంతమాట అన్నారేంటి సార్!

Bigg Boss 9 Telugu : సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించడంటే..?

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Big Stories

×