BigTV English

OTT Movie : పిల్ల కోసం తల్లిని పెళ్లాడే ఘనుడు… యూత్ ఫుల్ ఎంటర్టైనర్

OTT Movie : పిల్ల కోసం తల్లిని పెళ్లాడే ఘనుడు… యూత్ ఫుల్ ఎంటర్టైనర్

OTT Movie : ఈ రోజుల్లో డిజిటల్ మీడియా ఎంతగా పాపులర్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అతికొద్ది కాలం గ్యాప్ తో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ చేసే రోజులు వచ్చేసాయి. రొమాంటిక్ మూవీస్ ను మూవీ లవర్స్ ఓటిటిలో ఎక్కువగానే వీక్షిస్తారు. ఒక హాలీవుడ్ రొమాంటిక్ మూవీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ పేరేమిటో? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

కూతురి కోసం ఆమె తల్లిని పెళ్లి చేసుకొని, కూతుర్ని ప్రేమించే డిఫరెంట్ స్టోరీతో ఈ మూవీ నడుస్తుంది. ఇది ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్. ఈ మూవీ పేరు “లోలిత” (Lolitha). ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో తన టీనేజ్ లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు చనిపోతుంది. ఇక అప్పటి నుంచి ఆ అమ్మాయిని తలుచుకొని జీవిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు పెళ్లి కూడా చేసుకోకుండా ఉంటాడు. అయితే ఒకసారి ఉద్యోగరీత్యా ఒక ఊరిలో ఉండటానికి ఒక ఇల్లుని తీసుకుంటాడు. ఆ ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోతే, అద్దె ఇంటి కోసం వెతుకుతాడు. ఒకచోట అద్దెకు తీసుకుందామని చూస్తూ ఉండగా లోలిత అనే ఒక అమ్మాయి కనపడుతుంది. ఆమె అచ్చం చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ మాదిరి ఉంటుంది. ఆ ఇల్లు నచ్చకపోయినా ఆమె కోసం అందులోనే అద్దెకు ఉంటాడు. ఆ అమ్మాయిని చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటాడు. ఆమెకు ఒక తల్లి కూడా ఉంటుంది. ఒకరోజు ఆ అమ్మాయి ని హాస్టల్ లో వేస్తున్నానని ఆమె తల్లి ఇతనితో చెప్తుంది. హాస్టల్ కి వెళ్లే టైం కి ఆ అమ్మాయి ఇతనికి ముద్దు పెట్టి నేను వచ్చిన తర్వాత నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది.

ఆ షాక్ నుంచి తేరుకొని ఆ అమ్మాయి తల్లిని పెళ్లి చేసుకుంటే ఇక్కడే తనను చూస్తూ ఉండొచ్చు అని ఆమె తల్లిని పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజు అనుకోకుండా అతని డైరీని లోలిత తల్లి చూస్తుంది. ఆ డైరీలో తన కూతుర్ని హీరో ఇష్టపడుతున్నట్టు తెలుసుకుంటుంది. అతనితో గొడవపడి బయటికి వెళ్తుండగా కారు ప్రమాదంలో చనిపోతుంది. ఆ తర్వాత హీరో లోలిత దగ్గరికి వెళ్లి మీ అమ్మ ప్రమాదంలో హాస్పిటల్లో ఉందని అబద్ధం చెప్పి, తనని బయటకు తీసుకువెళ్తాడు. లోలితని హీరో బయటకు తీసుకువెళ్లి ఏం చేస్తాడు? తన తల్లి చనిపోయిన విషయం లోలితకి తెలుస్తుందా? లోలిత పై పెంచుకున్న ప్రేమ హీరోని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో  స్ట్రీమింగ్ అవుతున్న లోలిత మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీ ని చూస్తే ఒక ఫీల్ గూడ మూవీ ని చూశామన్న ఫీలింగ్ కలుగుతుంది డోంట్ మిస్ ఇట్.

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×