BigTV English
Advertisement

Nayani Pavani: బిగ్ బాస్ నుంచి నయని అవుట్.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందంటే?

Nayani Pavani: బిగ్ బాస్ నుంచి నయని అవుట్.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందంటే?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా మారుతుంది.. 9వ వారానికి గానూ ఐదుగురు నామినేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. ఓటింగ్ ముగియడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళిపోతారనే ప్రశ్న అందరిని కలచివేస్తుంది. మరి ఈ వీకెండ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతున్నది ఒక లేడి అని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా ఈ వారం డేంజర్ జోన్లో అతి తక్కువ ఓటింగ్ తో నయని పావని, హరితేజ ఉన్నట్లు గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వారం హౌస్ కు ఎవరు టాటా చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..


బిగ్ బాస్ 8 సీజన్ వైల్డ్‌కార్డ్స్‌తో షోలో కాస్త వినోదాన్నయితే తీసుకొచ్చారు కానీ మరీ అంతగా రక్తి కట్టించలేకపోతున్నారు.. కొత్తగా వచ్చిన వాళ్ళతో సరిగ్గా గేమ్స్ ఆడించలేకపోతున్నారు. దాంతో బిగ్ బాస్ రేటింగ్ కూడా తగ్గినట్లు తెలుస్తుంది. అందుకే వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వారిపై వేటు వేస్తున్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఎక్కువగా వైల్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. ఈ తొమ్మిదోవారం తేజ, యష్మి, నయని పావని, హరితేజ, గౌతమ్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. శక్తికి మించి ఆడిన తేజ అందరికన్నా ముందు సేవ్‌ అయిపోయాడు. యష్మికి ఆల్‌రెడీ ఫ్యాన్‌బేస్‌ ఉండటంతో పాటు తన టీమ్‌ కోసం నిఖిల్‌నే ఎదిరించడం ప్లస్‌ అయింది. అలా తనకు బాగానే ఓట్లు పడ్డాయి. గౌతమ్‌ కూడా తన శక్తి మేర ఆడుతున్నందున అతడు సైతం ఓటింగ్‌లో ముందువరుసలో ఉన్నాడు.

ఇక వెనుకంజలో హరి తేజ, నయని పావని లు ఉన్నారు. వీరిని హౌస్ లో ఎవరు గుర్తించలేదని తెగ ఫీల్ అవుతున్నారు. నిజంగానే ప్రేక్షకులు కూడా గుర్తించడం లేదేమో అందుకే ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్నారు. బీన్‌ బ్యాగు టాస్కులో హరితేజ పూనకం వచ్చినట్లుగా ఆడి మెప్పించింది.. నయని మాత్రం వీకెండ్ ఎపిసోడ్ లో తప్ప మిగిలిన ఏ రోజు కూడా నవ్వుతు కనిపించలేదు.. ఎప్పుడు చూసిన ఏడ్పు మొహం వేసుకొని ప్రేక్షకులకు బోర్ కొట్టించింది. దానికి ఆమెను హౌస్ మేట్స్ తో పాటుగా జనాలు కూడా తక్కువ ఓటింగ్ వేశారని టాక్ నడుస్తుంది.


ఇక నయని రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పేరొందిన నయని.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆమె పెద్ద పాపులర్ నటి కాకపోవడంతో.. రెమ్యూనరేషన్ కూడా మరీ ఆ సీరియల్ బ్యాచ్‌కి ఇచ్చినట్టుగా భారీగా అయితే లేదు. ఆమెకు రోజుకి రూ.30 వేలు చొప్పున ఇచ్చినా వారానికి ఆమెకి ముట్టింది రూ.1,80,000 అందుకుంది. అంటే నాలుగు వారాలకు గాను రూ. 7,20000 అందుకుందని తెలుస్తుంది.. ఈరోజు నయని ఎలిమినేట్ అనే విషయాన్ని నాగ్ చెప్పబోతున్నాడు. డ్యాన్స్ లతో వీకెండ్ ఇరగదీసే నయని వెళ్లిపోవడం ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Tags

Related News

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Big Stories

×