Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో చాలామంది ఫేవరెట్ కంటెస్టెంట్ అనగానే గుర్తుచేది ఇమ్మానుయేల్. గత కొన్ని రోజుల నుంచి ఇమ్మానుయేల్ అసలు రంగు కూడా బయటపడుతుంది. ఎప్పుడైతే నామినేషన్ ప్రక్రియలో భరణిని సపోర్ట్ చేయకుండా రాము రాథోడ్ ను సపోర్ట్ చేశాడు అప్పుడే కొంతమేరకు ఒరిజినల్ కలర్ బయట పడిపోయింది. అయితే అది ఇమ్మానుయేల్ గేమ్ ప్లాన్ కూడా అవ్వచ్చు.
కానీ షో కు వచ్చినప్పటి నుంచి క్లోజ్ గా ఉన్న ఏకైక పర్సన్ భరణి. అన్నా అన్నా అంటూ చాలా విషయాలు షేర్ చేసుకునేవాడు. తను కూడా కొన్ని విషయాలను అలానే ఇమ్మానుయేల్ లో చెప్పేవాడు. హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇమ్మానుయేల్ ని పలకరించిన మొదటి వ్యక్తి భరణి. ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ షోలో చాలామంది ఫేవరెట్ కంటెస్టెంట్ గా మారుతున్నాడు డిమాన్ పవన్.
పవన్ చాలామందికి జెన్యూన్ ప్లేయర్ లా అనిపిస్తున్నాడు. ముఖ్యంగా కొన్ని టాస్కులు ఆడే విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఎక్కడ కూడా పవన్ సింపతి వాడుకోవడం లేదు. అలానే కొన్ని విషయాలు చాలా మెచ్యూర్ గా ప్రవర్తిస్తున్నాడు. కొన్ని గేమ్స్ విషయంలో చాలా స్పోర్టివ్ గా ఉన్నాడు. కిచెన్ లో పనులు కూడా చాలా ఆసక్తిగా చేశాడు. అతని ఓపిక చూస్తుంటే చాలామందికి ఆశ్చర్యమేసింది.
కేవలం రీతుతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల అతని మీద కొద్దిపాటి నెగిటివ్ అభిప్రాయం ఉండేది. సందు దొరికిన ప్రతిసారి హగ్ చేసుకుంటున్నాడు అని కొన్ని నెగటివ్ కామెంట్లు కూడా వినిపించేవి. కానీ ఇప్పుడిప్పుడే తన ఆట తీరు చూసి ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చేస్తున్నాడు పవన్.
బిగ్ బాస్ షో అనేది ఈసారి అంతు చిక్కకుండా అయిపోయింది. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు తెలియడం లేదు. శ్రీజ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ కూడా ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది. కనీసం టాప్ ఫైవ్ లో తను ఉంటుంది అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు.
అయితే వచ్చిన రోజు నుంచి భరణి ఆట తీరు చూసినప్పుడు కూడా హౌస్ లో ఎక్కువ రోజులు ఉంటాడు అని అనుకుంటున్నారు. ఇప్పుడు పవన్ మాత్రం ఖచ్చితంగా అప్పటివరకు ఉండే అవకాశం ఉంది అనేది చాలామంది అభిప్రాయం. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read: Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు