BigTV English

Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు

Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు
Advertisement

Dheekshith Shetty : తెలుగు సినిమా నిర్మాతలు అలానే దర్శకులు భాషతో సంబంధం లేకుండా కొంతమంది నటులను విపరీతంగా ఇష్టపడతారు. ఒక సినిమాలో వాళ్ళ పర్ఫామెన్స్ విపరీతంగా నచ్చింది అంటే తెలుగు సినిమాల్లో వాళ్లను పెట్టుకోవడానికి వెనకాడరు. అందుకే ప్రస్తుత కాలంలో చాలామంది యంగ్ ఫిలిం మేకర్స్ మలయాళం నటులను కూడా తెలుగు సినిమాలో ఇన్వాల్వ్ చేస్తున్నారు.


శ్రీకాంత్ ఓదెల దర్శకుడుగా పరిచయమైన దసరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు దీక్షిత్ శెట్టి. తన నటనతో చాలామంది ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఇక ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తున్నాడు.

సినిమా అవ్వకముందే అడ్వాన్స్ 

గర్ల్ ఫ్రెండ్ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి నటించిన కొన్ని సీన్స్ ను రాహుల్ రవీంద్రన్ ఎడిట్ చేసి అల్లు అరవింద్ కి పంపించారు. అవి చూసి అల్లు అరవింద్ బాగా ఇంప్రెస్ అయిపోయారు. ఇంప్రెస్ అయిపోయిన తర్వాత. సినిమా పూర్తవ్వకముందే దీక్షిత్ ను పిలిపించారు. పిలిపించి రెండవ సినిమాకి అడ్వాన్స్ కూడా ఇచ్చారట.


అల్లు అరవింద్ గారు పిలుస్తున్నారు అని చెప్పినప్పుడు ఎందుకు పిలుస్తున్నారు అని దీక్షిత్ టెన్షన్ పడ్డాడు. కానీ కొంత ఫుటేజ్ చూసి అల్లు అరవింద్ రెండవ సినిమాకి అడ్వాన్స్ ఇవ్వడంతో ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు దీక్షిత్ శెట్టి.

రాహుల్ కం బ్యాక్ 

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటుడుగా పరిచయమయ్యాడు రాహుల్. ఆ తర్వాత నటుడుగానే కొన్ని సినిమాల్లో కనిపించాడు. రీసెంట్ గా సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమాలో కూడా కనిపించాడు.

అయితే రాహుల్ రవీంద్రన్ మంచి దర్శకుడు ఉన్నాడు అనే సంగతి తెలిసిందే. తాను దర్శకత్వం వహించిన చిల సౌ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత నాగర్జున హీరోగా చేసిన మన్మధుడు సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. అయితే ఈ సినిమాతో దర్శకుడుగా మంచి కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Elimination : షాకింగ్ ఎలిమినేషన్ రాము రాథోడ్ ఔట్, ఏంటి బిగ్ బాస్ ఇది?

Related News

Spirit : కేవలం పోలీస్ కాదు ఖైదీ కూడా, సందీప్ రెడ్డి వంగ గట్టిగానే ప్లాన్ చేశాడు

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

Big Stories

×