INDW vs NZW: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు సెమీస్ దశకు ఈ టోర్నమెంట్ వచ్చింది. తాజాగా న్యూజిలాండ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా కూడా సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇవాళ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో అద్భుతంగా విజయం సాధించిన మహిళల టీమిండియా… నేరుగా సెమీ ఫైనల్ కు వచ్చేసింది. 6 పాయింట్లతో సెమీ ఫైనల్ కు ఎంట్రీ ఇచ్చింది టీం ఇండియా.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరిగింది. వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ సెమీఫైనల్ కోసం పోటీపడ్డ ఈ జట్లు.. అందరినీ అలరించాయి. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా మహిళల జట్టు ఏకంగా 53 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మొదటి బ్యాటింగ్ చేయగా భారీ స్కోర్ చేసింది. ఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వర్షం అడ్డంకిగా మారింది. దీంతో 49 ఓవర్లకు మ్యాచ్ ఫిక్స్ చేశారు. అయినప్పటికీ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయిన టీమ్ ఇండియా 340 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో న్యూజిలాండ్ తడబడింది. 44 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన న్యూజిలాండ్ 271 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీం ఇండియా విజయం సాధించి నేరుగా సెమీఫైనల్ కు వెళ్ళింది.
న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా మహిళ ప్లేయర్లు ఇద్దరు సెంచరీలు నమోదు చేశారు. స్మృతి మందాన 109 పరుగులు చేయగా ప్రతిక రవల్ 122 పరుగులు చేసి దుమ్ము లేపింది. దీంతో టీమిండియా 340 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్ళగా న్యూజిలాండ్ ఇంటి దారి పట్టింది. ఇప్పటి వరకు టీం ఇండియా 6 మ్యాచ్ లు ఆడగా ఇందులో మూడు గెలిచి మూడింటిలో ఓడిపోయింది. అంటే మొత్తంగా ఆరు పాయింట్లు సాధించి సెమీ ఫైనల్ కు వెళ్లిన నాలుగో జట్టుగా టీమిండియా మహిళల జట్టు రికార్డులోకి ఎక్కింది. ఇక అటు న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. గ్రూప్ దశలో టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మరో మ్యాచ్ మిగిలి ఉంది. మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లు అక్టోబర్ 29 అలాగే అక్టోబర్ 30 వ తేదీల్లో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ రెండవ తేదీన ఆదివారం జరగనుంది. అయితే ఈ వేదిక ఇంకా ఖరారు కాలేదు. ముంబైలో జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
𝕋𝕙𝕖 𝕗𝕚𝕟𝕒𝕝 𝕗𝕠𝕦𝕣 𝕒𝕣𝕖 𝕙𝕖𝕣𝕖! 🏆✨
England, Australia, South Africa, and India have advanced to the semi-finals, keeping their World Cup dreams alive. 💥
Who will take the trophy home? 🤔#INDvNZ #SKC #CWC25 #Sportskeeda pic.twitter.com/DJO6xR1vJR
— Sportskeeda (@Sportskeeda) October 23, 2025