PSL-Multan Sultans: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ పై (Pakistan Super League 2026 Tournament ) నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందే పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ( Pakistan Cricket Board ) గొడవలు తెరపైకి వచ్చాయి. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహార శైలిపై ముల్తాన్ సుల్తాన్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ ను పీసీబీ అస్సలు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహించింది. ముల్తాన్ సుల్తాన్ జట్టుకు సంబంధించిన అలీ ఖాన్ తరీన్ ( Ali Khan Tareen ) ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు తీస్తూ ఆయన మాట్లాడారు. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ముల్తాన్ సుల్తాన్ జట్టును తొలగిస్తామని, మిమ్మల్ని బ్లాక్ చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ఏసీసీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ వివాదం ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కూడా కొనసాగడం కష్టమే గాని ఈ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఇటీవల ముల్తాన్ సుల్తాన్స్ ( MULTAN SULTAN ) జట్టు ఓనర్ అలీ ఖాన్ తరీన్ ( Ali Khan Tareen ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లీగ్ కోసం చాలా కోట్లు ఖర్చు పెడుతున్నాం.. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు ఆదరణ లభించడం లేదని ఆయన పేర్కొన్నారు. మార్కెటింగ్ చేయడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విఫలమవుతోందని మండిపడ్డారు. ప్రపంచ ఆదరణ లభిస్తేనే పాకిస్తాన్ సూపర్ లీగ్ కు మంచి జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కాస్త ఖర్చు పెట్టి లీగ్ ను డెవలప్మెంట్ చేయాలని పీసీబీకి సూచనలు చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ తరహాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను కూడా కొత్తదనంగా చూపించాలి… టోర్నమెంటులో పారదర్శకత కచ్చితంగా ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్ లో కొత్త ఆవిష్కరణలు ఉంటే జనాలు బాగా చూస్తారని పేర్కొన్నారు. ఈ దిశగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెళ్లడం లేదని మండిపడ్డారు. ఇలా అయితే టోర్నమెంట్ సక్సెస్ కావడం కష్టమన్నారు. దీంతో ముల్తాన్ సుల్తాన్ జట్టు పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అలీ ఖాన్ తరీన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముల్తాన్ సుల్తాన్ జట్టుపై సస్పెన్షన్ వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అర్థంపర్థం లేని వాదనలు చేశాడని ఆ జట్టుపై వేటు వేసేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమైంది. ఇప్పటికైనా మూల్తాన్ సుల్తాన్స్ ఓనర్ అలీ ఖాన్ తరీన్ తమకు క్షమాపణలు చెప్పాలని.. బహిరంగంగా క్షమాపణలు చెబితేనే వాళ్లు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడతారని వార్నింగ్ ఇచ్చింది పిసిబి. గతంలో చేసిన పొలిటికల్ కామెంట్స్ ను అతడు వెనక్కి తీసుకోవాలని కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. అయితే దీనిపై ముల్తాన్ సుల్తాన్స్ జట్టు యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి. వాస్తవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ కు మంచి పేరు రావాలని ముల్తాన్ సుల్తాన్ జట్టు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దాని ఓనర్ సూచనలు చేశారు. కానీ ఆ ఓనర్ పైనే శిక్ష వేసేందుకు పీసీబీ కుట్రలు పన్నుతోంది. ఇదంతా నఖ్వీ పనేనని సోషల్ మీడియాలో పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
🚨 SAVE PSL AND PAKISTAN CRICKET 🚨
This is clearly dictatorship by Mohsin Naqvi the same old 90s-style politics. If someone criticizes, they threaten or ban them instead of improving things and responding to critics through actions.
Ali Tareen is absolutely right about what… https://t.co/fwIysPH8R7
— junaiz (@dhillow_) October 23, 2025