Telangana Cabinet Meeting: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. హైకోర్టు తీర్పు అనంతరం ఈ ఎన్నికలకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపైన జనాలందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ హైకోర్టు తీర్పు అనంతరం స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటన చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ హైకోర్టు తీర్పు తర్వాత సర్పంచ్ ఎన్నికలపై కేబినెట్లో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. వచ్చే నెల 7వ తేదీన మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంటుందని.. అప్పుడే దీనిపై క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తీసుకుందని ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
SLBC ప్రాజెక్టును 2026 నాటికి లేదా 2027 జనవరి ప్రారంభం నాటికి పూర్తి చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలను ఫ్లోరైడ్ రహిత ప్రాంతాలుగా చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద 44 కిలోమీటర్ల సొరంగంలో ఇప్పటికే 35 కిలోమీటర్లు పూర్తయిందని, మిగతాది కూడా ఫినిష్ చేస్తామన్నారు. వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్, వరంగల్ లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్ లో ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే రామగుండంలో 52 ఏళ్ల కిందటి థర్మల్ స్టేషన్ కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో దాన్ని తొలగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే 10 సంవత్సరాల కారం పాటు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు అలాగే డిమాండ్ అంచనాలకు అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేయాలని విద్యుత్ శాఖను తెలంగాణ మంత్రి మండలి ఆదేశించినట్లు పేర్కొన్నారు.
ఈరోజు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ సందర్భంగా సహచర మంత్రులు @jupallyk_rao గారు, @Ponnam_INC గారు,… pic.twitter.com/IcBfFqB2yU
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) October 23, 2025