Ramu Rathod Elimination : షాకింగ్ ఎలిమినేషన్ రాము రాథోడ్ ఔట్, ఏంటి బిగ్ బాస్ ఇది?
బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు వరకు చేసుకుని బిగ్ బాస్ 7వ వారంలోకి ఎంటర్ ఇచ్చేసింది. అయితే రీసెంట్గా భరణి ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే. భరణితోపాటు రాము రాథోడ్ ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు ఇమ్మానుయేల్ కాపాడాడు. ఇద్దరికీ తక్కువ ఓట్లు ఉండటం వలన అ పోజిషన్ లో ఉండేవాళ్ళు.
ఇమ్మానుయేల్ ఇమ్యూనిటీ పవర్ రాము రాథోడ్ కి ఉపయోగించడంతో సేఫ్ అయిపోయాడు. టాప్ ఫైవ్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్న భరణి అలా వెళ్ళిపోతాడు అని ఎవరు ఊహించలేదు. అయితే బిగ్ బాస్ విపరీతమైన ట్విస్టులు ఇస్తున్న సంగతి తెలిసింది. ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ బయటకి వచ్చింది. రాము రాథోడ్ ఎలిమినేషన్.
బిగ్ బాస్ 9 లో అర్జున్ మరియు అమర్దీప్ పోలీసులుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని ప్రోమోలో కూడా చూపించారు. అయితే పోలీసులుగా ఇంటర్ ఇచ్చిన వీళ్లు రాముని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకెళ్ళిపోయారు.
ఇప్పుడు రాము రాథోడ్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు సమాచారం వినిపిస్తుంది. రాము రాథోడ్ ఎలిమినేషన్ అయిపోయినట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఎవరు ఊహించని ఒక సంఘటన. టాప్ లో ఉంటాడు అని చాలామంది ఊహించారు. కానీ మధ్యలో ఇలా జరగడం ఇంకో షాకింగ్ విషయం.
అయితే ఇక్కడ ఇంకో అసలైన ట్విస్ట్ ఉంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా తనను బయటకు తీసుకెళ్లిన మాట వాస్తవమే. అయితే హౌస్ మేట్స్ అందరూ కూడా ఎలిమినేట్ అయిపోయాడు అని నమ్మిన తర్వాత అది ఒక ప్రాంక్ లా మళ్ళీ లోపలికి తీసుకొచ్చాడు.
గతంలో కూడా సంజనాను మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు. అయితే తనని సీక్రెట్ రూమ్ లో ఉంచి హౌస్మెట్స్ అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు గమనించే అవకాశం ఇచ్చారు. ఇది అతి తక్కువ మందికి దొరికే ఒక అవకాశం అనేది చెప్పాలి. అప్పుడే రాము రాథోడ్ కూడా సంజన వార్నింగ్ ఇచ్చింది.
Also Read : SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు