BigTV English

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్‌లోకి అమర్ దీప్, అర్జున్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్‌కు ఊహించని షాక్..!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్‌లోకి అమర్ దీప్, అర్జున్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్‌కు ఊహించని షాక్..!
Advertisement

Bigg Boss 9 Telugu : తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 లో ఊహించని ట్విస్టులు ఆడియన్స్ ను పలకరిస్తున్నాయి. గత సీజన్లో పోలిస్తే ఈ సీజన్ జనాలని కాస్త ఆలోచనలో పడేస్తుంది. మొదటి ఎపిసోడ్ నుంచి ఇప్పటివరకు జనాలని కన్ఫ్యూజన్ లో పడేస్తూనే ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా వైల్డ్ కార్డు ఎంట్రీ లు కూడా జనాల ఊహకి అందని విధంగా జరిగాయి. ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఏడో వారం నామినేషన్స్ కూడా ప్రేక్షకులను అయోమయంలో పడేస్తున్నాయి. ఇలా చూస్తే మొదటినుంచి ఈ షోలో ఏదో ఒక ట్విస్ట్ ఎదురవుతూనే ఉంది. తాజాగా కంటెస్టెంట్లకి షాక్ ఇస్తూ అమర్ దీప్, అంబటి అర్జున్ హౌస్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఏంటి.. నిజమా? అనే సందేహం కూడా వస్తుంది కదూ.. కానీ ఇది నిజం.. మరి వాళ్లు హౌస్ లో ఉంటారా..? లేదా ఏదైన గైడెన్స్ ఇవ్వడానికి హౌస్ లోకి వచ్చారా అన్నది క్లారిటి రావాల్సి ఉంది..


హౌస్ లోకి అడుగుపెట్టిన అమర్ దీప్, అర్జున్..

బిగ్ బాస్ హౌస్లోకి గత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లు మళ్ళీ ఎంట్రీ ఇవ్వడం కామన్. బయట జరుగుతున్న పరిస్థితుల గురించి హౌస్ మేట్స్ కి ఇండైరెక్టుగా హిట్స్ ఇవ్వడంతో పాటుగా ఓటింగ్ గురించి కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నారు. అలాగే ఈ సీజన్లో అమర్ దీప్, అంబటి అర్జున్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడానికి కొద్దిరోజుల క్రితం అమర్ దీప్ ను బిగ్ బాస్ సంప్రదించిన విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు హౌస్ లోకి ఎందుకు వచ్చాడో తెలియదు కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది.. అసలు వాళ్లు రావడానికి కారణం ఏంటి? బిగ్ బాస్ కొత్త ప్లాన్ చేస్తున్నాడా..? ఇలాంటి ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి. ఏది ఏమైన ఇవాళ ఎపిసోడ్ లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read :కోడిలా మారిన ఇమ్మూ… బురదలో ఫిజికల్ టాస్క్.. ఇదేం ఆటరా నాయనా..


ఆ టాస్క్ కోసమే హౌస్ లోకి వీళ్లు వచ్చారు.. 

నిజానికి వీరిద్దరూ హౌస్ లోకి రావడానికి ఒక కారణం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో గ్యాంగ్ వార్స్ అనే టాస్క్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టాస్క్ ద్వారా కెప్టెన్సీ కంటెండర్లు గా కొంతమంది మిగులుతారు. వాళ్లకు టాస్క్ ఇవ్వడానికి వీరిద్దరినీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ 7 తెలుగులో వీరిద్దరూ కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు. ఆ సీజన్ కు విన్నర్ గా అమర్ దీప్ అవ్వగా, రన్నర్ గా అర్జున్ నిలిచాడు. మళ్లీ ఈ సీజన్ లోకి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం పై జనాల్లో ఆసక్తి నెలకొంది. జనాలను బాగా ఎంటర్టైన్ చేసింది.. పోలీస్ ఆఫీసర్స్ గా వీళ్లిద్దరు చేసిన కామెడీ బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పటికీ మిగిలిపోతాది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ హౌస్ మేట్స్ తో కలిసి ఎలా సందడి చేస్తారో చూడాలి..

Related News

Bigg Boss 9 Telugu : అనారోగ్యంతో హౌస్‌ నుంచి ఈ కంటెస్టెంట్ అవుట్.. పాపం అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : కోడిలా మారిన ఇమ్మూ… బురదలో ఫిజికల్ టాస్క్.. ఇదేం ఆటరా నాయనా..

Bigg Boss 9: ఎక్కడ తగ్గని తనూజ.. ఇమ్మాన్యుయేల్, రీతూ డబుల్ గేమ్.. మళ్లీ సంజనపై నెగ్గిన మాధురి..

Rithu Chaudhary : గౌరవ్ సూపర్ డెసిషన్, రీతుకు మొహం మీదే చెప్పేసాడు

Bigg Boss Thanuja : స్టార్ మా సీరియల్ బిడ్డ కాబట్టి తనుజ ను అంతలా లేపుతున్నారా? బిగ్ బాస్ చీకటి కోణం 

Madhuri Thanuja : రాజు అంటూనే మాధురికి నమ్మకద్రోహం, మనం కొన్ని కొన్ని నటించాలి

Venu Swamy-Bigg Boss 9: బిగ్‌ బాస్‌ బ్యాన్‌.. బాగా కాలుతున్నట్టుంది.. వేణుస్వామి సంచలన కామెంట్స్‌

Big Stories

×