Spirit Update: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అని గతంలోనే అనౌన్స్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇక అనిమల్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఎటువంటి వీడియో అయితే ప్లాన్ చేశాడో అచ్చం అలాంటి వీడియోని ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా ప్లాన్ చేశాడు.
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నేడు పలు రకాల అప్డేట్స్ వచ్చాయి. అయితే ఏ అప్డేట్ కూడా పూర్తిస్థాయిలో అభిమానులకు సంతృప్తిని ఇవ్వలేదు. అందరూ స్పిరిట్ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూశారు. ఒక్క విజువల్ కూడా చూపించకుండా కేవలం టైటిల్స్ తో వాయిస్ ఓవర్ తో మంచి హై ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ప్రకాష్ రాజ్ మొదటిసారి సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో పనిచేస్తున్నాడు.
పోలీస్ సైరన్ తో ఈ వీడియో మొదలైంది. ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ వీడియో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నీ పరేడ్ గ్రౌండ్ కాదు అని ప్రకాష్ రాజ్ చెప్పగానే…
పక్కనుంచి వేరే పోలీస్ ఆఫీసర్ సర్ ఐపీఎస్ ఆఫీసర్ సార్, అకాడమిక్ టాపర్ సర్ అంటూ చెప్పడం మొదలుపెట్టాడు.
ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవు ఓన్లీ నెంబర్స్. వీడికి ఆ ప్లాస్టర్ అంటించి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ ఫోటోలు తీయండి.
వాడు వీడు ఏంటి సార్ కాస్త రెస్పెక్ట్ మైంటైన్ చేయండి సార్ ప్లీజ్.
వీడి గురించి నేను విన్నాను యూనిఫారం ఉన్నా లేకపోయినా. బిహేవియర్ లో తేడా ఉండదు అని. ఆల్రెడీ ఒకసారి టెర్మినేట్ అయ్యాడని కూడా తెలుసు. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడు.
ఖైదీ యూనిఫారం ఏంటి సర్ ఇది రిమాండ్ పీరియడ్ కదా.?
షట్ అప్ ఐ హేట్ సివిలియన్ కాస్ట్యూమ్స్ ఇన్ మై కాంపౌండ్. అయితే ఇక్కడ ఖైదీలు ఉండాలి లేకపోతే ఖాకీ లు ఉండాలి. వీడి బట్టలు ఊడదీసి మెడికల్ టెస్ట్ కి పంపించండి. అని ప్రకాష్ రాజ్ చెప్పగానే.
ప్రభాస్ వాయిస్ ఓవర్ లో… మిస్టర్ సూపరిండెంట్ నాకు చిన్నప్పటినుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది. జస్ట్ హావ్ వన్ బాడ్ హ్యాబిట్ అంటూ ఈ వీడియోని ప్రభాస్ వాయిస్ తో ఎండ్ చేశారు. ఈ వీడియోకు కూడా వన్ బాడ్ హ్యాబిట్ అనే పేరు పెట్టారు.
Also Read: Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎలా ఉండబోతున్నాడు అని చాలామందికి ఇప్పటివరకు ఒక క్యూరియాసిటీ ఉండేది. కానీ ఈ వీడియో వచ్చిన తర్వాత ఖైదీల ఎలా బిహేవ్ చేస్తాడో అనే ప్రకాష్ రాజు వాయిస్ వినగానే. చాలామందికి సందీప్ గట్టిగానే ఏదో ప్లాన్ చేశాడు అని అర్థమవుతుంది. ఈ సినిమాలో వివేక్ ఓబెరాయ్ కూడా ఒక కీలకపాత్రలో కనిపిస్తున్నారు. మొత్తానికి మరో వెయ్యి కోట్లు సినిమా లైన్ లో ఉంది అని ఈ ఒక్క వీడియోతో అర్థం అయిపోతుంది.