Bigg Boss 9 Telugu : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. ప్రస్తుతం 9వ సీజన్ రసవత్తరంగా జరుగుతుంది. ఇప్పటివరకు ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఏడో వారం ఎలిమినేషన్ పై ఆసక్తి నెలకొంది. ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అని ఆసక్తి జనాల్లో కనపడుతుంది. అయితే ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ ప్రకారం రీతు బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సరే నామినేషన్స్ మాత్రం ఈసారి వాడీ వేడిగా జరిగాయి.. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఎవరు బయటకు వెళ్తారా అని జనాలు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది పక్కన పెడితే తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇదేం టాస్క్ రా నాయనా అంటూ నేటిజన్లు సైతం కామెంట్లు పెడుతున్నారు..
జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్ హౌస్ లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు.. తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ కంటెస్టెంట్ ఏడు వారాలు గా నామినేషన్స్ నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు. అంతో ఇంతో కంటెంట్ క్రియేట్ చేసి కామెడీని పంచేది కేవలం ఇమ్మానుయేల్ మాత్రమే.. దాంతో బిగ్ బాస్ అతన్ని ప్రతిసారి సేవ్ చేస్తూ వస్తున్నాడు అన్న వాదనలు కూడా నెట్టింట వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా బిగ్ బాస్ ప్రోమో ని రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో హౌస్ లో కోడిలాగా అరవాలి అని అంటాడు. ఎవరు కోడి లాగా అరిస్తే బాగుంటుంది అని బిగ్ బాస్ సంజనని అడుగుతాడు. ఇమాన్యుయేల్ అయితే బాగుంటుంది బిగ్ బాస్ అని సంజన అంటుంది.. అయితే హౌస్ లో కంటెస్టెంట్ లందరూ బిగ్ బాస్ అంటే కోడిలాగా అరవాలి అని బిగ్ బాస్ ఇమ్మూకు చెబుతాడు. హౌస్ లోని కంటెస్టెంట్లు మొత్తం ఓ ఆట ఆడుకుంటారు.
Also Read :కొడుకు కోసం కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..కూల్ డ్రింక్ కోసం ఆడాళ్ళ ఫైట్..వల్లికి షాక్..
బిగ్ బాస్ లో కొందరు గ్యాంగ్స్టర్ గా మారిన విషయం తెలిసిందే.. అయితే గ్యాంగ్ స్టర్స్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే జెండాని అజెండాగా పెట్టుకోవాలని బిగ్ బాస్ అంటాడు. మీ ఆధిపత్యాన్ని కొనసాగించడానికి మూడవ టాస్క్ గా జెండానే అజెండా చేయాలి అని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఎవరైతే తమ గ్యాంగ్ జెండాని తీసుకోవడంతో పాటుగా బోనస్ కోసం ఎల్లో జండాలని కూడా తీసుకోవాలని బిగ్ బాస్ అంటాడు. బురదలో కంటెస్టెంట్లు జెండాల కోసం పెద్ద కుస్తీని చేస్తారు. దివ్య, మాధురీలను ఎవరు ఎన్ని జెండాలు పెట్టారో చూడాలని బిగ్ బాస్ అంటాడు.. మొత్తానికి ఈ టాస్క్ లో కంటెస్టెంట్లకి కాస్త గాయాలు కూడా తగిలినట్టు తెలుస్తున్నాయి. మరి ఏ గ్యాంగు విన్నర్ గా నిలుస్తారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Gear up! Tough tasks and wild fun are about to shake the house! 👁️🔥
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar #BiggBossTelugu9 #StreamingNow #StarMaaPromo pic.twitter.com/PWlfptBKEG
— Starmaa (@StarMaa) October 23, 2025