Ram Charan : బిగ్ బాస్ లో గ్లోబల్ స్టార్ తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సీజన్ నుంచి ఈ షో విపరీతంగా వీక్షకులను అలరించింది. అయితే మొదటి సీజన్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది ఈ సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. ఈ సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్ లందరూ బాగా తెలిసిన వాళ్లే. అయితే బిగ్బాస్ సీజన్స్ పెరుగుతున్నకొద్దీ, తెలిసిన వాళ్లకంటే తెలుసుకోవాల్సిన వాళ్ళు ఎక్కువమంది ఎంట్రీ ఇవ్వడం మొదలుపెట్టారు. లాస్ట్ సీజన్ అయితే రైతుబిడ్డ అని చెప్పుకుంటూ హౌస్ లోకి ఎంటర్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఇకపోతే ఇప్పుడు కూడా చాలా ఆసక్తికరంగా 8వ సీజన్ జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఈ సీజన్ కి రామ్ చరణ్ తేజ్ గెస్ట్ గా వస్తున్నాడు అని వార్తలు వచ్చాయి.
ఇక దీనికి సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ నేడు జరుగుతుంది. దీనికి రామ్ చరణ్ తేజ్ గెస్ట్ గా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో రామ్ చరణ్ కారు దిగి ఈ షో కోసం సిద్ధమవుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందు నిమిత్తం అల్లు అర్జున్ పరామర్శించడానికి చాలామంది యంగ్ హీరోస్ అంతా కూడా తన నివాసానికి వెళ్లి గెలిచారు. అయితే మెగా హీరోస్ మాత్రం రాలేదు అని చాలామంది అనుకుంటున్నారు. మెగా బ్రదర్స్ అల్లు అర్జున్ జైలుకు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరింటికి అల్లు అర్జున్ వెళ్లడం మొదలుపెట్టాడు.
Also Read : Vijay Sethupathi : రామ్ చరణ్ సినిమా లో నటించడానికి నాకు టైం లేదు
అయితే ఒక వైపు అల్లు అర్జున్ జైల్లో నుంచి విడుదలైన హడావిడి జరుగుతుంటే, మరోవైపు మెగా హీరో వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ నటించిన సంబరాలు ఏటిగట్టు గ్లిమ్స్ వీడియోను ట్విట్టర్ వేదిక షేర్ చేసి ఆల్ ది బెస్ట్ తెలిపాడు. దానికి సాయి తేజ్ కూడా రెస్పాండ్ అయ్యాడు. వీరిద్దరి ట్వీట్స్ కింద కొంతమంది మెగా ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ పెడితే మరి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ పెట్టారు.అయితే అల్లు అర్జున్ తో కలిసి చరణ్ ఇప్పటివరకు కలిసి కనిపించలేదు. ఈ తరుణంలో రామ్ చరణ్ బిగ్ బాస్ షోలో కనిపించడం అనేది హాట్ టాపిక్ గా మారింది. లేకపోతే చరణ్ కూడా అల్లు అర్జున్ ని కలిసే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. అయితే అంతమంది కలిసినా కూడా మెగా యంగ్ హీరోస్ ఇంకా అల్లు అర్జున్ ను కలవలేదు అని ఇదివరకే చర్చలు మొదలయ్యాయి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అని నేటితో ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
#RamCharan𓃵 at #BiggBossTeugu8 #NagarjunaAkkineni #BiggBoss8 #Nikhil #Biggbosstelugufinal pic.twitter.com/Vi4k2aqfcH
— BIG TV Cinema (@BigtvCinema) December 15, 2024