Vijay Sethupathi : సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు. ముందుగా నటుడుగా కొన్ని సినిమాల్లో కనిపించిన విజయ్ సేతుపతి, ఆ తర్వాత హీరోగా కూడా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన పిజ్జా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాతోనే హీరోగా తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయమయ్యాడు విజయ్ సేతుపతి. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బుచ్చిబాబు దర్శకుడుగా పరిచయమైన ఉప్పెన సినిమాలో రాయణం అనే పాత్రలో కనిపించాడు విజయ్ సేతుపతి. ఆ పాత్రలో విజయ్ సేతుపతి నటించిన తీరు అద్భుతం అని చెప్పాలి. విలన్ పాత్రను తనదైన శైలిలో పండించాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాలో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తన డేట్స్ క్లాస్ అవడం వలన ఆ పాత్రకు ఫహద్ ఫాజిల్ ను తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో విజయ్ సేతుపతి ఉన్నాడు అని ఆ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి.
దాని గురించి రీసెంట్ గా క్లారిటీ ఇచ్చాడు విజయ్ సేతుపతి. నేను రామ్ చరణ్ సినిమాలో చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని ఒక ప్రముఖ జర్నలిస్టు అడిగినప్పుడు నాకు టైం లేదు అని చెప్పారు విజయ్ సేతుపతి. అంతే కాకుండా ఇప్పుడు తను చాలా కథలను వింటున్నట్లు తెలిపారు. కొన్ని కథలు బాగా నచ్చిన కూడా తన పాత్ర ఆ సినిమాలో తనకు సరిపోదు అని వదులుకుంటున్నట్లు విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. విజయ్ సేతుపతి తమిళ్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. తెలుగులో కూడా అవకాశం వస్తే లాంగ్వేజ్ బారియర్ లేకుండా తాను సినిమాను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని విజయ్ సేతుపతి తెలిపాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన విడుదల 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read : Actor Manchu Manoj: మళ్ళీ లొల్లి, పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తున్న మంచు మనోజ్