BigTV English
Advertisement

BB Telugu 8: నిఖిల్ కి షాక్ ఇచ్చిన మాజీ ప్రేయసి.. ఆయనకి సపోర్ట్ గా..!

BB Telugu 8: నిఖిల్ కి షాక్ ఇచ్చిన మాజీ ప్రేయసి.. ఆయనకి సపోర్ట్ గా..!

BB Telugu 8: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో తెలుగులో 8వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇందులో ఎవరికి వారు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ నిఖిల్ గురించి చెప్పుకోవాలి. మొదటి నుండి తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈయన.. హౌస్ లో ఉన్న వారి కంటే కాస్త అందగాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆడ పులి అనిపించుకున్న యష్మీ కూడా అతడికి ఆకర్షితురాలు అవ్వకుండా ఉండలేకపోయింది. వీళ్లంతా అతని వెంటపడి చివరికి.. మమ్మల్ని తన గేమ్ కోసం వాడుకున్నాడు అనే నిందలు కూడా నిఖిల్ పైవేసి వెళ్లిపోయారు.


కావ్యను మరిచిపోలేకపోతున్న నిఖిల్..

మరోవైపు నిఖిల్ కి గతంలో కావ్య (Kavya)అనే అమ్మాయి ప్రేయసిగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో పలు రీల్స్ కూడా చేసే వాళ్ళు. ఎన్నో ఈవెంట్స్, సీరియల్స్ కూడా కలిసి చేశారు. ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని ఫ్యాన్స్ కూడా అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల విడిపోవాల్సి వచ్చింది. దీంతో సోలోగా హౌస్ లోకి అడుగుపెట్టారు నిఖిల్. నిఖిల్ సింగిల్ అనే విషయంపై క్లారిటీ ఉండడం వల్లే హౌస్ లో ఉండే అమ్మాయిలు కూడా ఇతని వెంటపడ్డారు. కానీ ఆయన మనసులో ఇంకా కావ్య ఉంది అనే విషయం 12 వ వారమే అందరికీ తెలిసింది. యష్మీ కి కూడా అప్పుడే తెలియడంతో ఆమె మైండ్ కూడా బ్లాక్ అయినంత పని అయింది. ముందే చెప్పి ఉండుంటే తన గేమ్ తాను ఆడుకొని ఉండేది కదా.. నిఖిల్ ఇక్కడ చాలా పెద్ద తప్పు చేశాడని అభిమానులు సైతం అభిప్రాయపడ్డారు.


నిఖిల్ కి షాక్ ఇచ్చిన మాజీ ప్రేయసి..

అయితే నిఖిల్ కి కావ్యతో మళ్ళీ కలవాలని ఉంది. కానీ కావ్య మాత్రం నిఖిల్ ను నమ్మడం లేదు. అతడు నాటకాలు ఆడుతున్నాడు అంటూ ఇన్స్టాగ్రామ్ లో అనేకసార్లు స్టోరీలు కూడా పెట్టింది. అంతేకాదు గతంలో నిఖిల్ తో చిన్న ట్రాక్ నడిపిన సోడియా కూడా ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా మారిపోయింది. నిఖిల్ పై మనసు పడిన ప్రతి అమ్మాయి కూడా ఇప్పుడు గౌతమ్ కి సపోర్ట్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా బిగ్ బాస్ షోలోకి రాకముందు “కిర్రాక్ బాయ్స్ కిలాడి లేడీస్” అనే షో స్టార్ మా చానల్లో ప్రసారమై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ షోలో నిఖిల్ తో పాటు గౌతమ్, టేస్టీ తేజ, ప్రేరణ, విష్ణు ప్రియ వంటి వారు కూడా పాల్గొన్నారు. ఇక ఇందులో పాల్గొన్న రీతూ చౌదరి నిఖిల్ పై మనసు పారేసుకుంది. షో మొత్తం అతడికి పులిహోర కలుపుతూ తన డ్రీమ్ బాయ్ అంటూ చెప్పుకొని తిరిగింది. హౌస్ లోకి అడుగుపెడితే నిఖిల్ తో లవ్ ట్రాక్ నడుపుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె హౌస్ లోకి రాలేదు. ఇక కనీసం బయట నుంచైనా ఆయనకు సపోర్టు చేస్తుందని అనుకున్నారు. అయితే అదీ జరగలేదు. ఇప్పుడు అనూహ్యంగా జెన్యూన్ గా గేమ్ ఆడుతున్న గౌతం కి కనెక్ట్ అయ్యింది. ఫినాలే లో గౌతమ్ కి ఓట్లు వేసి గెలిపించండి అంటూ తన ఇంస్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తోంది రీతూ చౌదరి. ఇలా నిఖిల్ ని ఒకప్పుడు ఇష్టపడిన అమ్మాయిలు ఇప్పుడు గౌతమ్ గెలుపు కోసం ఆరాటపడుతున్నారు. మరి బిగ్ బాస్ నిర్వహకులు, అటు ఆడియన్స్ ఎవరికి టైటిల్ ఇస్తారో చూడాలి.

Related News

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Bigg Boss 9 : ఈ సీజన్ లో అలాంటి వాడు లేడు, కెప్టెన్ కి ఇచ్చి పడేసాడు 

Big Stories

×