BigTV English

Siddharth’s Miss You Flim : కనీసం ఈరోజు సినిమా రిలీజ్ అని కూడా గుర్తు లేదేమో

Siddharth’s Miss You Flim : కనీసం ఈరోజు సినిమా రిలీజ్ అని కూడా గుర్తు లేదేమో

Siddharth’s Miss You Flim: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సిద్ధార్థ నటించిన సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. కానీ ఒకప్పుడు సిద్ధార్థ సినిమా అంటే కూడా ఒక క్రేజ్ ఉండేది. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు సిద్ధార్థ ను ఒక లవర్ బాయ్ గా ట్రీట్ చేస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టిన సిద్ధార్థ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు చేసి లవర్ బాయ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించి ఉన్నాడు. పేరుకు తమిళ్ హీరో అయినా కూడా తెలుగులో మంచి ఫ్యాన్స్ ను సాధించుకున్నాడు సిద్ధార్థ్.


కేవలం తెలుగు తమిళ్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ హాలీవుడ్ లో కూడా సిద్ధార్థ సినిమాలు చేశాడు. ఇక తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం కొంచెం కష్టం , ఓయ్ వంటి ఎన్నో సినిమాలు మంచి హిట్ గా నిలిచాయి. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దాదాపు చాలా ఏళ్లు గ్యాప్ తీసుకున్న సిద్ధార్థ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినయి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ముఖ్యంగా ఈ సినిమా మీద విపరీతమైన ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆ సినిమా ఎఫెక్ట్ వల్లనే ప్రస్తుతం గేమ్ చేంజెర్ సినిమాకి తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్లు కూడా లేరు అని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

ఇకపోతే సిద్ధార్థ నటించిన మిస్ యు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకి మినిమం రెస్పాన్స్ కూడా లేదు. చాలామందికి ఈ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అని తెలియదు కూడా. వాస్తవానికి ఈ సినిమాను నవంబర్ 29న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. తెలుగులో కూడా ప్రమోషన్స్ చేశారు అయితే తమిళనాడులో వరదలు కారణంగా ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇకపోతే సిద్ధార్థ కి ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది ఇప్పుడు అది కంప్లీట్ గా పోయింది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రీసెంట్ టైమ్స్ లో పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాట్నా ఈవెంట్ గురించి కూడా సిద్ధార్థ మాట్లాడుతూ జెసిబి తో పనిచేసుకుంటూనే ఒక 100 మంది వచ్చి గుంపుగా చేరుతారు. పాట్నా ఈవెంట్ కి అంతమంది రావడం అనేది ప్రమోషనల్ స్టంట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సిద్ధార్థ ట్రోల్ కు గురయ్యాడు. ఈ విషయం పైన అల్లు అర్జున్ కు నాకు బేధాభిప్రాయాలు ఏమీ లేవు అని క్లారిటీ కూడా ఇచ్చాడు. ఏదేమైనా అటువంటి కామెంట్స్ వలన కూడా సినిమాకి కొంత నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అనేది వాస్తవం. ఈరోజు సిద్ధార్థ కూడా అదే జరిగిందని చెప్పొచ్చు.


Also Read : Robin Hood : దిల్ రాజ్ పోటీగా, మైత్రి మూవీస్, నితిన్ ఒప్పుకుంటాడా.?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×