Elon Musk Justin Trudeau| అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇటీవల పరోక్షంగా కెనెడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో విమర్శలు చేయడంతో ట్రంప్ సన్నిహితుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయిన ఎలన్ మస్క్ సీరియస్ అయ్యారు. జస్టిస్ ట్రూడోని భరించలేని వ్యక్తిగా అభివర్ణించారు. ఆయన ఎక్కువ కాలం ప్రధాన మంత్రి పదవిలో కొనసాగరని జోస్యం చెప్పారు.
జస్టిన్ ట్రూడో ఏమన్నారు?
కెనెడాలోని ఒట్టావా గాలాలో ‘ఈక్వల్ వాయిస్’ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పాల్గొన్నారు. ‘ఈక్వల్ వాయిస్’ అనే సంస్థ ఎన్నికల్లో మహిళలకు కూడా సమానత్వం ఉండాలని పోరాటం చేస్తోంది. కార్యక్రమంలో ప్రధాని ట్రూడో అనూహ్యంగా అమెరికా ఎన్నికల గురించి మాట్లాడారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలల్లో కమలా హ్యారిస్ ఓటమి తో అమెరికా మహిళల అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలతో ఉదహరిస్తూ.. మహిళలకు సమాన హక్కులు లభించకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డుపడుతున్నాయని వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మరో మారు ప్రస్తావిస్తూ.. “అనుకున్నది జరగలేదు. అంతా సవ్యంగా సాగుతోంది కదా అని అనుకున్నాం. కష్ట సమయంలో కూడా అభివృద్ధి పథంలో నడవాలని భావించాం. కానీ కొన్ని వారాల క్రితం అమెరికాలో రెండో సారి ప్రజల ఒక మహిళా ప్రెసిడెంట్ అభ్యర్థిని తిరస్కరించారు. కానీ నేను మాత్రం గర్వంగా ఒక్కటే చెప్పదలుచుకున్నా.. నేను ఒక ఫెమినిస్ట్ (మహిళా పక్షపాతి)ని” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రధాని ట్రూడో అమెరిక ప్రజలు కమలా హారిస్‌ని ఎన్నుకోకుండా తప్పుచేశారని ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు.
Also Read: బ్రిటన్‌లో మేనరిక వివాహాలపై నిషేధం.. బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన ఇండియన్ ఎంపీ
అంతకుముందు ఇటీవలే ట్రూడో అమెరికా వెళ్లి ట్రంప్ తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు.. ట్రూడోని ట్రంప్ ఒక దేశ ప్రధానిగా కాకుండా ఒక రాష్ట్ర గవర్నర్‌గా అభివర్ణించారు. తాను ట్రూడోని పొరుగు దేశ ప్రధానిగా కంటే తమ దేశంలోనే ఒక రాష్ట్ర గవర్నర్ గా భావిస్తానని ట్రంప్ చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఆ సమయంలో స్పందించని జస్టిన్ ట్రూడో తన దేశానికి తిరిగి వెళ్లి సందర్భాను సారంగా పరోక్షంగా అమెరికా ప్రజలు ఆయనను ఎన్నుకోవడం పెద్ద తప్పు అని తెలిపారు.
కానీ ట్రూడో వ్యాఖ్యలపై ట్రంప్ సన్నిహితుడు ఎలన్ మస్క్ మండిపడ్డారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరపున మస్క్ 270 మిలియన్ డాలర్లకు పై గా ఖర్చు చేశారు. ప్రచారంలో ట్రంప్‌నకు అండగా అన్నీ తానై కష్టపడ్డారు. అందుకే ట్రంప్ తన విజయానికి మూల కారకుడు ఎలన్ మస్క్ అని ఫలితాలు వెలువడిన తరువాత చెప్పారు.
ఇప్పుడు కెనెడా ప్రధాని ట్రంప్ పై పరోక్షంగా విమర్శలు చేయడంపై ఎలన్ మస్క్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. “ట్రూడో ఒక భరించలేని టూల్. ఎక్కువ కాలం అధికారంలో ఉండడు.” అని రాశాడు.
నెల రోజుల క్రితం కూడా ఎలన్ మస్క్ ట్రూడోపై ఇలాంటి కామెంట్స్ చేశారు. 2023లో కెనెడా ప్రభుత్వం అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ప్రభుత్వ నియంత్రణలో తీసుకువచ్చే విధంగా చట్టం తీసుకురావడంపై ఎలన్ మస్క్ కెనెడా ప్రధాన మంత్రిని ఉద్దేశించి.. “కెనెడా ఎన్నికల్లో ట్రుడో ఓడిపోతాడు. అతను ఉండడు” అని కామెంట్ చేశాడు.