Trinayani Serial : బుల్లితెర పై ప్రసారం అవుతుందని సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ ఎంతగా పాపులర్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సీరియల్స్ లో నటించినా ఎంతో మంది హీరోయిన్లు తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేస్తున్నారు. మూవీ హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ వీళ్ల సొంతం. బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు సీరియల్స్ లలో నటిస్తున్న హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనురేషన్ గురించి తెలుసుకోవాలని చాలామంది గూగుల్ లో తెగ వెతికేస్తూ ఉంటారు. ఈమధ్య సీరియల్ హీరోయిన్ ల గురించి అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. పర్సనల్ లైఫ్ తో పాటుగా ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.. ఇందులో సీరియల్ లో నటిస్తున్న మెయిన్ క్యారెక్టర్ల రెమ్యూనరేషన్ ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటివరకు మనం ఎంతోమంది సీరియల్ హీరోయిన్ల రెమ్యూనరేషన్ గురించి తెలుసుకున్నాం.. ఇప్పుడు జీ తెలుగు లో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్ హీరోయిన్ నయని ఒక్కరోజుకు ఎంత తీసుకుంటుందో ఒకసారి తెలుసుకుందాం..
బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతో మంది హీరోయిన్లు స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంటున్నారు.. అందులో కొందరు హీరోయిన్లు హీరోయిన్లను మించి ఫాలోయింగ్ కూడా సోషల్ మీడియాలో పెంచుకుంటున్నారు. లేటెస్ట్ ఫోటోలతో రోజు రోజుకి సోషల్ మీడియా ఐకాన్ గా మారుతున్నారు. అలాంటివారిలో త్రినయని సీరియల్ యాక్టర్ నయని ఒకటి. ఈమె అసలు పేరు ఆషిక పదుకొనే.. కథలో రాజకుమారి సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ‘త్రినయని’ సీరియల్‌లో టైటిల్ పాత్రలో నటించింది, ఇది తెలుగు ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది.. ఈమె చేసింది రెండు మూడు సీరియల్స్ అయినా బాగా ఫేమస్ అయింది. ఒక రోజుకి 25 వేలు వసూల్ చేస్తుందట.. నెలకు లక్షల్లో సంపాదిస్తుంది. ఈమె సీరియల్స్ తో పాటుగా ప్రోగ్రామ్ లు కూడా చేస్తుంది.
Also Read : శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రేమను గెలికిన వల్లి.. విశ్వం ప్లాన్ వర్కౌట్..?
జీ తెలుగులో ప్రసారమవుతున్న పలు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది ఆషిక పదుకొనే.. ఆమె జూన్ 29, 1996న కర్ణాటకలోని ఉడిపిలో జన్మించింది. తెలుగు బుల్లితెరపై ‘కథలో రాజకుమారి’ మరియు ‘త్రినయని’ సీరియల్స్‌లో నటిగా ప్రేక్షకులకు పరిచయం అయింది. ప్రస్తుతం ఈమె తెలుగులో జీ తెలుగులో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్ లో నటిస్తుంది. ఒకవైపు సీరియస్ చేస్తూ మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈమధ్య ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్లలో స్పెషల్ పర్ఫామెన్స్ లు కూడా చేస్తుంది.. అంతేకాదు కొన్ని షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తుందని తెలుస్తుంది. ఇకపోతే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో యువతను ఆకట్టుకునే విధంగా అదిరిపోయే స్టిల్స్ తో ఫోటో షూట్ చేస్తుంది. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.