Allu -Mega: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బడా కుటుంబాలుగా పేరు తెచ్చుకున్న ఫ్యామిలీస్ లో అల్లు – మెగా కుటుంబాలకు ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పైగా ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అటు సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఇటు ఈ 2 కుటుంబాలలో కూడా ఎలాంటి చిన్న ఫంక్షన్ జరిగినా సరే మెగా – అల్లు కుటుంబాలు ఒక చోట చేరి సందడి చేస్తూ ఉంటాయి. అయితే అలాంటి ఈ కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా వార్ నడుస్తోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.
దీనికి తోడు అటు అల్లు అర్జున్(Allu Arjun).. మెగా ఫ్యామిలీని దాదాపు పట్టించుకోలేదని చెప్పవచ్చు. పైగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా అల్లు అర్జున్ ని దాదాపుగా దూరం పెట్టేశారు అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇలాంటి సమయంలో ఇప్పుడిప్పుడే అల్లు – మెగా కుటుంబాలు కలిసిపోతున్నాయని చెప్పవచ్చు. అంతేకాదు బన్నీలో ఊహించని మార్పు వచ్చింది అని, అందుకు సంబంధించిన సాక్షాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బీజం అక్కడే పడిందా?
వాస్తవానికి రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్నప్పటికీ.. నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఇన్ని రోజులు వ్యవహరించారు. కానీ తాజా పరిస్థితులను బట్టి చూస్తే.. ఈ కుటుంబాలు ఇప్పుడు మెల్లిగా కలిసిపోతున్నాయి. ఇలా కలిసిపోవడానికి అల్లు కనక రత్నమ్మ (Allu Kanakaratnamma) మరణం బీజం వేసిందని చెప్పాలి. ఇంతకుముందు బర్తడే లకు కానీ ఇతర ఈవెంట్లకు కానీ కనీసం విష్ కూడా చేసుకునే వాళ్ళు కాదు. దీంతో అల్లు – మెగా అభిమానుల మధ్య కూడా వ్యతిరేకత ఏర్పడింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అల్లు అర్జున్ లో ఆ మార్పు మొదలైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ALSO READ:Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 ఫస్ట్ కెప్టెన్… సంజనా గల్రానీ
బన్నీలో ఊహించని మార్పు..
అందులో భాగంగానే తన నానమ్మ అల్లు కనకరత్నమ్మ మరణించినప్పుడు మెగా ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. దీనికి తోడు మొన్న జరిగిన దశదినకర్మ రోజు కూడా మెగా ఫ్యామిలీ ఫోటోలను పెట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు అల్లు అర్జున్. పైగా నిన్న మెగా కుటుంబంలోకి వారసుడు రావడంతో ప్రత్యేకంగా సోషల్ మీడియా ఖాతా ద్వారా వరుణ్ తేజ్ (Varun Tej) , లావణ్య (Lavanya Tripathi) లకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. అంతేకాదు మొన్న సెప్టెంబర్ రెండవ తేదీ కూడా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కు బర్తడే స్పెషల్ విషెస్ తెలియజేసిన అల్లు అర్జున్.. అంతకుముందు ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కి కూడా బర్తడే విషెస్ తెలియజేశారు.
సంతోషంలో ఫ్యాన్స్..
ఇవన్నీ చూస్తుంటే అల్లు అర్జున్ లో ఊహించని మార్పు వచ్చింది అని, ఇక దాదాపుగా అల్లు – మెగా కుటుంబాలు కలిసిపోతున్నాయని అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. ఇక భవిష్యత్తులో కూడా ఇది ఇలాగే కొనసాగాలని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.. ఏది ఏమైనా అటు మరణం (అల్లు కనక రత్నమ్మ)ఇటు పుట్టుక (లావణ్య త్రిపాఠి – వరుణ్ లకు కొడుకు పుట్టడం) వీరిలో భారీ మార్పులు తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
Hearty congratulations to @IAmVarunTej & @Itslavanya on the arrival of your little bundle of joy. Wishing you both endless happiness as you begin this beautiful new journey. pic.twitter.com/kAnIscaxkB
— Allu Arjun (@alluarjun) September 11, 2025