Big Boss..బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమం గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఇప్పటికే హిందీలో ఏకంగా 18 సీజన్లు పూర్తిచేసుకుంది. అటు తెలుగులో కూడా 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ షో ఒక తెలుగు, హిందీ మాత్రమే కాదు కన్నడ, మలయాళం వంటి ఇతర భాషలలో కూడా ఈ రియాల్టీ షో ప్రసారమవుతూ అక్కడి అభిమానులను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తోంది. ఇదిలా ఉండగా కన్నడలో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) ఎలా అయితే సుదీర్ఘకాలంగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారో.. ఇటు తెలుగులో నాగార్జున (Nagarjuna) కూడా అంతే సుదీర్ఘకాలంగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక బాలీవుడ్ విషయానికి వెళ్తే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని సీజన్ ల నుంచి కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్ గా వ్యవహరిస్తూ తన హోస్టింగ్ తో షో కి మంచి టిఆర్పి రేటింగ్ తీసుకొస్తున్నారు.
త్వరలో బిగ్ బాస్ ప్రారంభం..
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 19 మళ్లీ ప్రారంభం కానుంది. అయితే సల్మాన్ ఖాన్ ఈ సారి హోస్ట్గా చేయరు అని, ఆయనకున్న ప్రాణహాని కారణంగా ఇంకొకరు రంగంలోకి దిగుతారంటూ వార్తలు వచ్చినా.. సల్మాన్ ఖాన్ కి ఉన్న క్రేజ్.. హోస్ట్ పై ఆయనకున్న పట్టు కారణంగా హిందీ ఆడియన్స్ పదేపదే ఆయనను కోరుకుంటుండడంతో మళ్లీ బిగ్ బాస్ నిర్వాహకులు కూడా సల్మాన్ ఖాన్ నే హోస్టుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం సల్మాన్ ఖాన్ భారీగా రెమ్యూనరేషన్ పెంచేశారు.
ఈ విషయం తెలిసి అటు స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు వేలకోట్ల కలెక్షన్స్ వసూలు చేసి, సరికొత్త రికార్డులు సృష్టించిన స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదు. కానీ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో కోసం చేస్తున్న డిమాండ్ చూస్తే మాత్రం కళ్ళు తిరగాల్సిందే. మరి సల్మాన్ ఖాన్ ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
త్వరలో బిగ్ బాస్ 19 ప్రోమో..
సాధారణంగా మూడు నెలల పాటు కొనసాగే ఈ షో 19వ సీజన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకోసం సల్మాన్ ఖాన్ ఈనెల ఆఖరు నాటికి ప్రోమో షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. ప్రతి సీజన్లో లాగానే ఈ సీజన్ లో కూడా ఎవరెవరు పాల్గొంటున్నారు అనే దానిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆశ్చర్యపరుస్తున్న సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 18వ సీజన్ కోసం రూ.250కోట్లు తీసుకున్న సల్మాన్ ఖాన్.. ఈసారి బిగ్ బాస్ షో రన్నింగ్ టైం పెరగడంతో తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశాడు. ఈ సీజన్ కోసం దాదాపుగా రూ.300 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రతిసారి ఈ బిగ్ బాస్ షో కేవలం మూడు నెలలు కొనసాగేది. కానీ ఈసారి నాలుగు నెలలు షో నిర్వహించనున్నట్లు సమాచారం.. అందుకే ఈ రేంజ్ లో సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. అటు నిర్వాహకులు కూడా ఆయనకున్న క్రేజ్ ను బట్టి.. అడిగినంత ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఏది ఏమైనా ఒక రియాల్టీ షో కోసం సల్మాన్ ఖాన్ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.