Mahua Moitra Dance: బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బీజేడీ మాజీ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది పికాకీ మిశ్రాను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ఎంపీ మహువా ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా తెలిపింది. అయితే భర్తతో కలిసి ఆమె డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.
ఎంపీ మహువా మొయిత్రా-మాజీ ఎంపీ పికాకీ మిశ్రా ఇటీవల వివాహం చేసుకున్నారు. మే 3న జర్మన్ రాజధాని బెర్లిన్‌లో వీరి వివాహం జరిగింది. మ్యారేజ్ తర్వాత జరిగిన ఓ కార్యక్రమంలో నూతన దంపతులు అదిరిపోయేలా డ్యాన్స్ చేశారు. ఎందుకంటే ఆ రొమాంటిక్ సాంగ్ అలాంటిది.
తొలుత వివాహ బంధం గురించి ఈ జంట సీక్రెట్‌గా ఉంచింది. పెళ్లిపై ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. సంప్రదాయ దుస్తుల్లో ఒకరి చేయి మరొకరు పట్టుకుని ఉన్న ఫొటో వైరల్‌గా మారింది. దీంతో ఈ జంట వివాహం విషయం వెలుగులోకి వచ్చింది. చివరకు మహువా ఎక్స్ వేదికగా తెలిపారు.
నూతన వధూవరులు 1967 వచ్చిన మూవీ ‘యాన్ ఈవినింగ్ ఇన్ పారిస్’లోని ఓ రొమాంటిక్ సాంగ్‌కు అదిరిపోయేలా స్టెప్పులు వేశారు. ఒకరి చేయి మరొకరు పట్టుకుని కాసేపు ఆనందంలో తేలిపోయారు. దీనికి సంబంధించి పలువురు చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. వయస్సు అనేది శరీరానికేనని, మనసుకు ఏ మాత్రం కాదని నిరూపించింది ఈ జంట.
ALSO READ: అటు మేళం.. ఇటు చెప్పుదెబ్బలు, ఇదేం పెళ్లి బాబోయ్
తాము డ్యాన్స్ చేసిన వీడియో చూసి ఈ జంట మురిసిపోతోంది. పెళ్లైన కొత్తలో తాము ఈ విధంగా డ్యాన్స్ చేశామంటే నమ్మకం లేకపోతున్నామని అంటున్నారు. పలువురు రాజకీయ నేతలు డ్యాన్స్ వీడియో షేర్ చేస్తున్నారు. తాము లోక్‌సభలో మహువా మాటలు విన్నామని, ఇప్పుడు డ్యాన్స్ చూస్తున్నామని అంటున్నారు కొందరు నేతలు.
1974 అక్టోబర్ 12న అస్సాంలో జన్మించారు మహువా మొయిత్రా. రాజకీయాల్లోకి రాకముందు పెట్టుబడి బ్యాంకర్‌గా తన వృత్తి ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది.
పరిస్థితి గమనించిన మహువా మొయిత్రా దశాబ్దమున్నర కిందట అంటే 2010లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 2019 లో పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు మహువా. మొన్నటి ఎన్నికల్లో ఆ స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు.
ఒడిశాలోని పూరీ ప్రాంతానికి చెందినవారు పినాకీ మిశ్రా. 1959న అక్టోబర్ 23న జన్మించిన ఆయన, కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1996లో పూరీ నుంచి తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ పార్టీలో చేరారు. అప్పటి నుండి పార్లమెంటులో అనేక పర్యాయాలు విజయం సాధించారాయన. 2009, 2014, 2019లో పూరీ నుంచి గెలిపొందుతూ వచ్చారు.
TMC MP #MahuaMoitra shares video dancing with hubby Pinaki Misra at their wedding ceremony in Germany pic.twitter.com/tpGRzXhPye
— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) June 8, 2025