BigTV English

Shekar Basha: సోనియాకు కాబోయే భర్త నాకు ఫోన్ చేశాడు.. బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్స్‌పై శేఖర్ భాషా కామెంట్స్

Shekar Basha: సోనియాకు కాబోయే భర్త నాకు ఫోన్ చేశాడు.. బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్స్‌పై శేఖర్ భాషా కామెంట్స్

Bigg Boss Shekar Basha: బిగ్ బాస్ సీజన్ 8 నుండి రెండోవారం ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేశాడు శేఖర్ భాషా. కానీ ఆ ఎలిమినేషన్ ప్రేక్షకుల వల్ల జరగలేదు. హౌస్‌లోని కంటెస్టెంట్స్ కలిసికట్టుగా తనను బయటికి పంపించేశారు. దీంతో శేఖర్ భాషా ఆటను ఇష్టపడే ఆడియన్స్.. తన రీఎంట్రీ కచ్చితంగా ఉంటుంది అని ఫిక్స్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత తనకు ఎక్కువగా రీఎంట్రీ గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ తను మాత్రం ఈ విషయంలో ఓపెన్‌గా మాట్లాడడం లేదు. తాజాగా బిగ్ టీవీలో ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కూడా శేఖర్ భాషాకు ఇదే ప్రశ్న ఎదురయ్యింది.


జనాల ఫీలింగ్ ఏంటో

బిగ్ బాస్ హౌస్‌లోకి శేఖర్ భాషా రీఎంట్రీ గురించి ప్రశ్న వచ్చినప్పుడల్లా ఆయన దానిని దాటేస్తున్నారు. క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ చాలావరకు ఆయన రీఎంట్రీ ఖాయం అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ వారి దగ్గర పసతో పాటు నస కూడా ఉంది. నిఖిల్, నైనికాలో మొదట్లో ఉన్న ఫైర్ ఇప్పుడు లేదని అన్నాడు. బిగ్ బాస్ పెట్టే టాస్కుల వల్ల ఏదో ఒకరోజు ఫైర్ మళ్లీ బయటికి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశాడు. పృథ్వి, విష్ణుప్రియా లవ్ స్టోరీపై స్పందిస్తూ.. ‘‘సోనియా ప్లేస్‌ను విష్ణుప్రియా తీసుకుంటే వీరిద్దరి ప్రేమకథను చూసి జనాలు ఎలా ఫీలవుతారో’’ అని చెప్పాడు.


Also Read: హౌస్‌మేట్స్ చేతికి ఆ పవర్.. చీఫ్స్ ఇద్దరూ ఇలా ఇరుక్కుపోయారేంటి?

అందరికీ కాంట్రాక్ట్స్

బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్ మధ్య కనెక్షన్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం హౌస్‌లో ఉన్న అందరికీ బయట బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ ఉన్నారు. వాళ్లు టీవీ చూస్తున్నారు. సోనియా బాయ్‌ఫ్రెండ్ నాకు కాల్ చేశాడు. ఏంటీ నెగిటివిటీ అని అడిగితే.. తను అలాంటిది కాదు అని చెప్పుకున్నాడు. బయట వాళ్లకు మనుషులు ఉన్నా కూడా లోపల లవ్ ట్రాకులు నడుపుతున్నారంటే నేనేం చెప్పాలి’’ అని అన్నాడు శేఖర్ భాషా. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా వచ్చేవారు అందరికీ సెపరేట్ కాంట్రాక్ట్స్ ఉంటాయని, ఒకరి కాంట్రాక్ట్ గురించి మరొకరికి తెలియదని బయటపెట్టాడు. తనను మాత్రం సరదాగా ఉండమన్నారని, అందుకే ఎక్కువగా సరదాగానే ఉన్నానని తెలిపాడు.

బలహీనుడిని కాదు

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో అందరికంటే బలహీనమైన కంటెస్టెంట్ ఎవరు అంటే అందరూ వెంటనే నాగ మణికంఠ పేరు చెప్తున్నారు. అలాగే శేఖర్ భాషా హౌస్‌లో ఉంటే తన పేరు కూడా వచ్చేదా అని తనకు ప్రశ్న ఎదురయ్యింది. అయితే హౌస్‌లో అందరికంటే స్ట్రాంగ్ అనుకుంటున్న నిఖిల్, నబీల్‌నే తాను ఓడించానని కానీ ఆ ఫుటేజ్ ప్రేక్షకుల వరకు రాలేదని తెలిపాడు శేఖర్ భాషా. అంతే కాకుండా టాస్కులు ఆడే విషయంలో బిగ్ బాసే తనకు అవకాశం ఇవ్వలేదని ఉన్నాడు. చీఫ్ కూడా తనకు పూర్తిగా అవకాశం ఇవ్వలేదని, టాస్కుల విషయంలో తాను వెనకబడడానికి అవే కారణాలు అని అన్నాడు. కానీ తాను శారీరికంగా బలహీనుడు అనే మాటను మాత్రం ఒప్పుకోలేదు శేఖర్ భాషా.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×