BigTV English

Bigg Boss 8 Telugu: హౌస్‌మేట్స్ చేతికి ఆ పవర్.. చీఫ్స్ ఇద్దరూ ఇలా ఇరుక్కుపోయారేంటి?

Bigg Boss 8 Telugu: హౌస్‌మేట్స్ చేతికి ఆ పవర్.. చీఫ్స్ ఇద్దరూ ఇలా ఇరుక్కుపోయారేంటి?

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8 ప్రస్తుతం అయిదోవారానికి చేరుకుంది. గతవారంలో కంటెస్టెంట్ సపోర్ట్‌తో సీత కొత్తగా చీఫ్ అయ్యింది. ఇక నిఖిల్ అయితే బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి చీఫ్ స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. నామినేషన్స్ సమయం రాగానే హౌస్‌లోని చీఫ్స్‌కు ఏదో ఒక విధంగా ట్విస్ట్స్ ఇస్తూనే ఉన్నారు బిగ్ బాస్. కానీ తాజాగా జరిగిన నామినేషన్స్‌లో అలా జరగలేదు. ఈసారి ఆ పవర్ హౌస్‌మేట్స్ చేతికి వెళ్లింది. సోనియా ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయినా కూడా హౌస్‌లో నిఖిల్‌కు సపోర్ట్ చాలావరకు తగ్గిపోయింది. ఆఖరికి తన టీమ్ సభ్యులే తనకు సపోర్ట్ చేయడం లేదని తాజాగా జరిగిన నామినేషన్స్‌లో కన్ఫర్మ్ అయ్యింది.


సంచాలకుడిగా ఫెయిల్

మునుపటి వారాలతో పోలిస్తే ఈవారం నామినేషన్స్ కాస్త సాఫీగానే సాగిపోయాయేమో అనే ఆలోచన ప్రేక్షకులకు వస్తుంది. అందరూ అనుకున్నట్టుగానే యష్మీని మణికంఠ, మణికంఠను యష్మీ నామినేట్ చేసుకున్నారు. ఈసారి నామినేషన్స్‌లో మణికంఠతో పాటు విష్ణుప్రియా, నైనికాకు కూడా చాలానే ఓట్లు పడ్డాయి. ఇక గతవారం మొత్తం ఎంటర్‌టైనర్‌గా ఎంటర్‌టైన్ చేసిన నబీల్ కూడా ఈసారి నామినేషన్స్ నుండి తప్పించుకోలేకపోయాడు. రేషన్ కోసం ఇరు టీమ్స్‌కు ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దానికి నబీల్ సంచాలకుడిగా వ్యవహరించాడు. తను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల తన టీమ్‌కే రేషన్ తక్కువగా వచ్చింది. ఇదే కారణంతో నబీల్‌ను నామినేట్ చేశారు కంటెస్టెంట్స్.


Also Read: ఆదిత్య ఓం పిచ్చి పని, అందరికీ బిగ్ బాస్ వార్నింగ్.. మొత్తానికి తప్పులు ఒప్పుకున్న విష్ణుప్రియా

ఫ్రెండ్స్ మధ్య నామినేషన్స్

సంచాలకుడిగా ఫెయిల్ అంటూ తనపై వచ్చిన నామినేషన్‌ను నవ్వుతూ యాక్సెప్ట్ చేశాడు నబీల్. అంతే కాకుండా ఈ వారమంతా హౌస్‌మేట్స్ అందరూ తిన్న తర్వాతే తాను తింటానని మాటిచ్చాడు. ఫ్రెండ్స్ అయినా కూడా సీత, నైనికా వచ్చి విష్ణుప్రియాను నామినేట్ చేసి షాకిచ్చారు. ఒక చీఫ్ స్థానంలో ఉంది కాబట్టి తన టీమ్‌లో ఉన్న విష్ణుప్రియా పర్ఫార్మెన్స్ తనకు ఎక్కువగా కనిపించలేదని కారణం చెప్పింది సీత. నైనికా, విష్ణుప్రియా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మణికంఠను పృథ్వి నామినేట్ చేయగా వారిద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. తనను రెచ్చగొట్టొద్దని మణి చెప్తున్నా కూడా పృథ్వి రెచ్చగొట్టాడు. నిఖిల్ కూడా ఈ విషయంలో పృథ్వికే సపోర్ట్ చేశాడు.

వారి చేతికి పవర్

నామినేషన్స్ ప్రారంభమయ్యే ముందు నిఖిల్, సీత చీఫ్స్ కాబట్టి వారిని ఎవరూ నామినేట్ చేయకూడదు అని ప్రకటించారు బిగ్ బాస్. దీంతో వారిద్దరినీ హౌస్‌‌మేట్స్ ఎవరూ నామినేట్ చేయలేదు. కానీ నామినేషన్స్ పూర్తయిన తర్వాత సీత, నిఖిల్‌లో ఒకరిని నామినేట్ చేసే పవర్‌ను కంటెస్టెంట్స్‌కు ఇచ్చారు బిగ్ బాస్. దీంతో ఎక్కువమంది సీత సేవ్ అవ్వాలని ఓట్లు వేశారు. ఆఖరికి నిఖిల్ టీమ్‌లో ఉన్న ఆదిత్య ఓం కూడా సీతనే సేవ్ చేశాడు. అలా నిఖిల్ కూడా నామినేషన్స్‌లోకి వచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 8లో అయిదోవారం నామినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారే విష్ణుప్రియా, నైనికా, మణికంఠ, ఆదిత్య, నబీల్, నిఖిల్.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×