BigTV English

Bigg Boss Nainika : నైనిక ఇంత సెల్ఫిషా.. బయటపడ్డ షాకింగ్ నిజాలు..!

Bigg Boss Nainika : నైనిక ఇంత సెల్ఫిషా.. బయటపడ్డ షాకింగ్ నిజాలు..!

Bigg Boss Nainika : బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా పాల్గొన్న నైనిక గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆమె బిగ్ బాస్ కన్నా ముందు ఢీ డ్యాన్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అక్కడ తన టాలెంట్ తో డ్యాన్సర్ గా పేరు తెచ్చుకుంది. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ ఐదో వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.. అయితే ఈమె రెమ్యూనరేషన్ కూడా బాగా అందుకుందని టాక్. హౌస్ లో ఉన్నందుకు ఈమె దాదాపు రూ. 12 లక్షల వరకు తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. నైనిక బయటకు రాగానే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ లో పాల్గొని సంచలన విషయాలను బయట పెట్టింది. ఇక తాజాగా ఈమె గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


అదేంటంటే.. నైనిక బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాలు కొనసాగింది. మొదటి రెండు వారాలు కాస్త ఆటలో చురుగ్గా పాల్గొంటు ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత క్లాన్స్ డివైడ్ చేసినప్పుడు తన ఆడే అవకాశాలు ఉన్నా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండేది. అదే ఆమెకు మైనస్ అయ్యింది. ప్రతి నామినేషన్ లో ఆమె పేరు వినిపించేది.. డేంజర్ జోన్ లోకి వెళ్లి తృటిలో తప్పుంచుకొని ఐదు వారాలు కొనసాగింది. ఇక తక్కువ ఓటింగ్ తో బయటకు వచ్చేసింది. అయితే నైనిక హౌస్ లో ఉన్న తీరు పై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె అసలు స్వరూపం ఇదే ఓ వార్త ప్రచారంలో ఉంది..

నైనిక అవసరానికి అందరిని వాడుకుందా?


నైనిక ఆడిన గేమ్ బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. హౌస్ లో అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చిన ఏకైక కంటెస్టెంట్ గా కనిపించిన నైనిక.. ఆ తర్వాత ఎందుకో పూర్తిగా స్లో అయిపోయింది. క్లాన్‌ చీఫ్‌గా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఆటలోనూ నిరుత్సాహపరిచింది. స్నేహితులతో ముచ్చట్లు పెట్టడం తప్ప టాస్కులు, గేమ్స్ లో పెద్దగా యాక్టివ్ గా పాల్గొనలేకపోయింది. నైనిక ఆట తీరును చూసి నాగార్జున ఆశ్చర్యపోయాడు.. ఆమె మాటలతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారి సాయంతో మరోవారం కొనసాగుతుంది. చీఫ్ గా ఉన్న నిఖిల్ ఒకసారి నామినేషన్ నుంచి సేవ్ చేశాడు. ఆ తర్వాత గేమ్ లలో కూడా తన టీమ్ సాయంతో ఏదో రాణించింది. ఐదు వారాల్లో మొదటి నాలుగు రోజులు మాత్రమే కసితో టాస్క్ లు చేసింది. కానీ రాను రాను ఆటలో కనిపించలేదు. ఇదే పాయింట్ తో లాస్ట్ వీక్ అందరు నామినేట్ చేశారు. కేవలం తన స్వార్థం కోసమే అందరిని వాడుకుంటూ సేవ్ అవుతూ వచ్చిందనే టాక్ బయట వినిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సెల్ఫిష్ గా ఆలోచిస్తూ అవతలి వాళ్లను ఇరికించింది. అది జనాలకు నచ్చకనే తక్కువ ఓటింగ్ వెయ్యడంతో బయటకు వచ్చింది.. ప్రస్తుతం గ్లామర్ డోస్ పెంచేసింది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరికి షాక్ ఇస్తుంది..

Related News

Navadeep: తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఐయామ్ సారీ అంటూ నవదీప్ వీడియో

Bigg Boss telugu: నన్ను దూరం పెట్టారు.. అతడే జడ్జ్ గా ఎందుకు?

DMart Offers: ఆ వస్తువులు సగం ధరలకే, డిమార్ట్ వినాయక చవితి బంపర్ ఆఫర్!

Agni Pariksha: డైరెక్టర్ క్రిష్ కే చెమటలు పట్టించిన అగ్నిపరీక్ష.. ఇదెక్కడి ఉత్కంఠరా బాబు?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లోకి మరో కన్నడ నటి.. రచ్చ మాములుగా ఉండదు మరి..!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష పై ఆడియన్స్ రియాక్షన్..ఇదొక బొ** పరీక్ష అంటూ!

Big Stories

×