Bigg Boss 9 : బిగ్బాస్ రియాలిటీ షో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. 8 సీజన్లను మించి తొమ్మిదవ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలిమినేషన్ డే కూడా వచ్చేసింది. బిగ్ బాస్ లో నటిస్తున్న చాలామంది కంటెస్టెంట్లు గురించి ఇప్పటికే ఒక ఐడియా వచ్చింది. అయితే పూర్తిస్థాయిలో ఎవరి రంగులు ఇంకా బయటపడలేదు.
అందరికంటే ముందు షాంపు కండిషనర్స్ విషయంలో గొడవపడిన సంజన తో హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. రెండవ రోజు గుడ్డును తినేసి హౌస్ మొత్తాన్ని ఆగం చేసేసింది. అందరూ అంత పెద్ద డిస్కషన్ చేస్తుంటే ఏమీ తెలియనట్టు సైలెంట్ గా కూర్చుంది. తాను గుడ్డు తిన్న విషయం తనూజ, భరణికి తెలుసు అని రివిల్ చేసింది. ఆశ్చర్యకరంగా తనని సీజన్ 9 మొదటి కెప్టెన్ అయిపోయింది.
సృష్టి వర్మ డాన్సర్ గా ఢీ షో లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని మంచి పేరు సంపాదించిన. కేవలం డాన్సర్ గానే కాకుండా కొరియోగ్రాఫర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. పుష్ప సినిమాలో కూడా తను కొరియోగ్రఫీ చేసింది. ఒక టైం లో జానీ మాస్టర్ తో ఈమెకు మంచి రిలేషన్ ఉండేది. మన సందర్భాలలో జానీ మాస్టర్ తన కెరీర్ కోసం చాలా హెల్ప్ చేశారు అంటూ మాట్లాడింది. అయితే సడన్ గా జానీ మాస్టర్ తనను వాడుకున్నారు అంటూ ఆరోపణలు చేసింది. అయితే దానిలో వాస్తవాలు ఇప్పటికీ ఇంకా బయటపడలేదు.
అక్కడితో షష్టి వర్మ బాగా ఫేమస్ అయిపోయారు. తెలియని వాళ్లు కూడా తన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. బహుశా అందుకే బిగ్ బాస్ యాజమాన్యం కూడా షష్టి వర్మాను సెలబ్రిటీ లిస్టులో యాడ్ చేశారు. సీజన్ 9 స్టార్ట్ అయి ఆరు రోజులు అయినా కూడా ఇప్పటికీ సృష్టి వర్మ మార్క్, గేమ్ ప్లాన్ అంటూ షోలో పెద్దగా కనిపించలేదు. ఈరోజు అతను ఎలిమినేట్ అవుతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిలో ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు.
ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించడం అనేది మామూలు విషయమే. ఇక జానీ మాస్టర్ ఇష్యూలో చాలామంది జానీ మాస్టర్ ని కూడా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ జానీ మాస్టర్ ని సపోర్ట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ కి కూడా పొద్దుపెట్టి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక షష్టి వర్మ ఎలిమినేట్ అని రూమర్స్ రాగానే బయట జానీ మాస్టర్ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఎలిమినేషన్ గురించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ బయటపడలేదు.
Also Read: Tg viswa Prasad: నాకు డబ్బులు ఊరికే రాలేదు… మిరాయ్ రిలీజ్ తర్వాత నిర్మాత ఫైర్