E-Paper
Advertisement

Tg viswa Prasad: నాకు డబ్బులు ఊరికే రాలేదు… మిరాయ్ రిలీజ్ తర్వాత నిర్మాత ఫైర్

Tg viswa Prasad: నాకు డబ్బులు ఊరికే రాలేదు… మిరాయ్ రిలీజ్ తర్వాత నిర్మాత ఫైర్
Advertisement

Tg viswa Prasad: ఒక ఆలోచన నమ్మి డబ్బులు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. డబ్బులు పెట్టే నిర్మాత అందరికంటే ముందు ఆ ఆలోచన నమ్మి ఇది వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తాడు. అంతే తప్ప ఎవరూ కావాలని తప్పకుండా డబ్బులు పోగొట్టుకోరు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇప్పటివరకు దాదాపు 50 సినిమాలు పూర్తి కావస్తున్నాయి. అయితే ఈ బ్యానర్లు గట్టిగా మాట్లాడితే బాగా హీట్ అయిన సినిమాలు కార్తికేయ 2 మరియు ధమాకా. ఈ రెండు సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాయి.

కార్తీక్ ఘట్టమనేని (Karthik gattamaneni) దర్శకత్వంలో తేజ సజ్జ ( Teja Sajja)  హీరోగా చేసిన సినిమా మిరాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదలైంది. ఈ సినిమా గురించి విపరీతమైన పాజిటివ్ టాక్ సోషల్ మీడియాలో వినిపించింది. ఈ సినిమాకు సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ అదిరిపోయింది అంటూ ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కనిపిస్తున్నాయి.

నాకు డబ్బులు ఊరికే రాలేదు 

Advertisement

అయితే ఈ సినిమాకి ప్రశంసలు ఎలా వస్తున్నాయో ఈ సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పైన విమర్శలు కూడా అలానే వస్తున్నాయి. ఈ సినిమా హిట్ టాక్ వచ్చిన వెంటనే అరుణాచలం సినిమాలో రజనీకాంత్ హార్స్ రేసింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమా పొరపాటున హిట్ అయిపోయింది అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీని కొంతమంది ప్రూల్ చేయడం మొదలుపెట్టారు.

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వీటన్నిటికీ సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో కొన్ని ట్రోలింగ్స్ వస్తున్నాయి. అరుణాచలం సినిమాలో సీన్స్ పెట్టు మరి ట్రోలింగ్ చేస్తున్నారు. నాకు డబ్బులు ఊరికే రాలేదు. 2000 రూపాయలు ఇంటెన్షిప్ తో నా కెరియర్ స్టార్ట్ చేశాను. 2000 డాలర్స్ తో అమెరికాలో కెరియర్ మొదలు పెట్టాను. నేను ఆలోచించి ఖర్చు పెడతాను అంటూ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

కలెక్షన్లు దూకుడు 

Advertisement

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సినిమా బాగుంది అని టాక్ వినిపించగానే జనాలందరూ థియేటర్ కి వెళ్లడం మొదలుపెడతారు. ప్రస్తుతం మిరాయి ఈ సినిమా కూడా అదే జరుగుతుంది. ఈ సినిమాకి అద్భుతమైన టాక్ రావడంతో ప్రస్తుతం ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజు ఈ సినిమాకి దాదాపు 20 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు అయ్యాయి. ఈ సినిమా ఏ స్థాయి వరకు కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి.

Also Read: Bigg Boss 9 : పర్మిషన్ లేకుండా ఫుడ్డు తిన్న హరీష్, రిస్క్ లో పడ్డ కెప్టెన్ సంజన

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×