Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్ 20వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పురోగతి సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. సంతాన విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.
దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. నూతన రుణయత్నాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు.
నూతన వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి.
నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. నూతన రుణయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలలో వాయిదా పడుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి.
స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పాటిస్తారు.
కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి.
ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పనులు చకచకా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తాయి.
వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్త్ర వస్తులాభాలు పొందుతారు.
దూర ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితులతో విభేదాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో కొందరి మాటలు మానసికంగా బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. పాత ఋణలు తీర్చడానికి నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.
కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరంగా సమస్యలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం దైవ చింతన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం.