Alcohol Teaser :ఒకప్పుడు కమెడీయన్ గా వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేష్ (Allari Naresh) ఈ మధ్యకాలంలో పూర్తిగా జానర్ మార్చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సీరియస్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆల్కహాల్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నరేష్. రుహానీ శర్మ(Ruhani sharma) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి మెహర్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం దీని టీజర్ ను విడుదల చేశారు. ఇందులో సత్య, నిహారిక ఎన్ ఎమ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్ ఆద్యంతం సరికొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఆల్కహాల్ టీజర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. టీజర్ ఓపెన్ చేయగానే చుట్టూ ఉన్న వారంతా మద్యం తాగుతూ ఉంటారు. కానీ అల్లరి నరేష్ మాత్రం మద్యం సేవించరు. సత్య మాట్లాడుతూ.. “లక్షలకులక్షలు సంపాదిస్తావు. మందు తాగవు ఎందుకురా నీ బతుకు ” అంటూ ప్రశ్నిస్తాడు. తాగుడుకు , మందుకు సంబంధం ఏముంది సార్ అని నరేష్ తిరిగి ప్రశ్నిస్తాడు.. అసలు నువ్వు ఎందుకు తాగవో చెప్పురా అని సత్య ఫ్రస్టేషన్ తో అడిగితే నరేష్ మాత్రం.. నేను తాగితే మీకు డ్రైవర్ ఉండడు కదా సార్ అంటాడు. నేను సీరియస్ గా అడిగినప్పుడు జోక్ చేస్తావ్ ఏంటి గబ్బు నా కొడకా అంటూ సత్య ఫైర్ అవుతాడు. వెంటనే నరేష్ తాగితే మన మీద మనకే కంట్రోల్ ఉండదు కదా సార్ అంటూ చెబుతూ.. యాక్షన్ రంగంలోకి దిగుతాడు. ఇక నరేష్ కి బలవంతంగా మద్యం తాగించాలని ప్రయత్నం చేస్తారు కొంతమంది. ఆ తర్వాత నరేష్ ఒక్కొక్కరిని హింసకు గురి చేస్తూ మద్యం తాగాలంటేనే భయపడే రేంజ్ లో వారికి చిత్రవధ అంటే ఏంటో చూపిస్తాడు. అలా చాలా సరికొత్త కాన్సెప్ట్ తో ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇది చూసిన నెటిజెన్స్ తాగుబోతులపై దండయాత్ర చేయడానికి నరేష్ వస్తున్నాడు జాగ్రత్త అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ టీజర్ ఆకట్టుకుంటుంది.
అల్లరి నరేష్ కెరియర్..
అల్లరి నరేష్ కెరీర్ విషయానికి వస్తే.. ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన మొదట అల్లరి అనే సినిమాతో హీరోగా అవతారమెత్తారు. ఇక ఆ సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకొని వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో నాంది అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరి వచ్చే యేడాది రాబోతున్న ఈ ఆల్కహాల్ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ALSO READ:Ghaati Action Trailer : అనుష్క యాక్షన్‌కి గూస్‌బంప్స్… ఇది లేడీ బ్లడ్ బాత్