OTT Movie : సరికొత్త స్టోరీలతో ఈటీవీ విన్ నుంచి ప్రతీవారం షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఇవి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరవుతున్నాయి. మంచి ఫీల్ గుడ్ కంటెంట్ ఉన్న కథలతో ఆసక్తికరంగా ఉంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఒక కథ ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది తల్లీకూతుర్ల మధ్య జరిగే ఒక ఎమోషనల్ స్టోరీ. కార్పొరేట్ ప్రపంచంలో మనుషులు బిజీ లైఫ్ ని ఎంచుకుని, ఏం మిస్ అవుతున్నారో కళ్ళకు కట్టినట్లు ఈ సినిమా చూపిస్తుంది. దీని పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ఒక మంచి ప్రేమ కథ’ (Oka Manchi Prema Katha) ఇది అక్కినేని కుటుంబరావు డైరెక్ట్ చేసిన తెలుగు ఫ్యామిలీ డ్రామా చిత్రం. ఇందులో రోహిణి హట్టంగడి, రోహిణి మొల్లేటి, సముతిరకాని, హిమాన్షు పోపురి, సౌమ్య, అనన్య నాన్నాపానేని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా
2025 అక్టోబర్ 16 నుంచి ETV Win లో స్ట్రీమింగ్ అవుతోంది.
సుజాత అనే యాభై ఏళ్ల ఉద్యోగిణి, కార్పొరేట్ జీవితంలో బిజీగా ఉంటుంది. ఆమె మొత్తం టైమ్ కెరీర్‌కు ఇచ్చి, తన ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తుంది. దీంతో ఆమె డిప్రెషన్‌లో కూడా పడుతుంది. ఆమె భర్త కూడా భార్యతో పాటు బిజీ లైఫ్ లో ఉంటాడు. దీంతో వృద్ధురాలు అయిన ఆమె తల్లి రంగమణి ఆరోగ్యం పాడవుతుంది. ఆమెను పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో చాలా బాధపడుతుంది. కూతురు ఏమాత్రం ఆమెకు సమయం ఇవ్వకపోవడంతో ఒంటరితనంతో మిగిలిపోతుంది. ఆ వయసులో ఆమె పడే బాధ ఆడియన్స్ కళ్ళను చెమ్మగిల్లేలా చేస్తుంది.
Read Also : బాయ్ ఫ్రెండ్ తో ఒంటరిగా గడిపే అమ్మాయిలే ఈ కిల్లర్ టార్గెట్… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మావా
సుజాత మాత్రం తన వ్యాపారాన్ని ఇంకా పెంచాలని రాత్రి పగలు కష్టపడుతుంటుంది. ఇక తన తల్లిని చూసుకోవడం కదరకపోవడంతో సుజాత తన రంగమణిని ఒక ఓల్డేజ్ హోమ్ లో చేర్పించాలనుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రంగమణి మరింత డిప్రెషన్ కి వెళ్తుంది. ఆ తరువాత అసలు స్టోరీ మొదలవుతుంది. ప్రతి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఈ కథ ఉంటుంది ? చివరికి సుజాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? రంగమణి ఓల్డేజ్ హోమ్ కి వెళ్తుందా ? ఆమె మనసులో ఏముంది ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.