BigTV English

Big TV Exclusive: బిగ్ బాస్ నుండి సోనియా ఔట్.. కారణాలు ఇవే అంటున్న ప్రేక్షకులు

Big TV Exclusive: బిగ్ బాస్ నుండి సోనియా ఔట్.. కారణాలు ఇవే అంటున్న ప్రేక్షకులు

Bigg Boss Sonia Akula: బిగ్ బాస్ సీజన్ 8లో నాలుగోవారం ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఈవారం సోనియా హౌస్ నుండి బయటికి వెళ్లిపోయిందని తెలిసిన చాలామంది ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఎందుకంటే సోనియా ఎప్పుడు గేమ్ మీద ఆసక్తి చూపించలేదని, తన ఫోకస్ అంతా నిఖిల్, పృథ్విలపైనే ఉండేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. సోనియాకు సపోర్ట్ చేసేవారికంటే తనపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంది. అందుకే తను ఎలిమినేట్ అవ్వడం మంచి విషయమని, ఇప్పటికైనా నిఖిల్, పృథ్వి.. ఎవరి గేమ్ మీద వారు ఫోకస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు.


సొంత డబ్బా

పలు సినిమాల్లో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను అలరించింది సోనియా. ముఖ్యంగా కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో తనకు బయట మంచి సాన్నిహిత్యం ఉంది. అలా బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత సోనియా అంటే ఎవరో ప్రేక్షకులకు తెలిసింది. హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుండి తను చాలా బోల్డ్ అని, నచ్చిందే చేస్తానని తన గురించి తాను చాలా గొప్పగా చెప్పుకుంది. అలా చెప్పుకోవడం వల్ల కొందరు ప్రేక్షకుల్లో తనపై పాజిటివ్ అభిప్రాయం వచ్చినా.. మిగతావారు మాత్రం తను డబ్బా కొట్టుకుంటుంది అనే ఫీలింగ్‌లోనే ఉన్నారు. తనపై ఉన్న కొంచెం పాజిటివ్ అభిప్రాయం కూడా ప్రేక్షకుల్లో మెల్లగా మారుతూ వచ్చింది.


Also Read: అరె ఏంట్రా ఈ కన్ఫ్యుజన్.. వైల్డ్ కార్డు ఎంట్రీ లేనట్టేనా?

వాళ్లు నా అన్నయ్యలు

సోనియాకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. తన పేరు యష్వీర్. ఈ విషయం నాగార్జునే స్వయంగా ఒక వీకెండ్ ఎపిసోడ్‌లో బయటపెట్టారు. కానీ హౌస్‌లో నిఖిల్, పృథ్విలతో తన ప్రవర్తన మాత్రం అలా లేదని చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. ఒకరోజు నిఖిల్, పృథ్విలను తన అన్నయ్యల్లాగా ఫీల్ అవుతానని వ్యాఖ్యలు చేసింది సోనియా. కానీ తన ప్రవర్తన, వాళ్లను తను టచ్ చేసే విధానం మాత్రం అలా లేదని ఆడియన్స్ గమనించారు. దానివల్ల తన గురించి చెడుగా మాట్లాడుకోవడం కూడా మొదలుపెట్టారు. పృథ్వి విషయంలో ఎలా ఉన్నా.. నిఖిల్ మాత్రం ఎమోషనల్ ఫూల్ చేసి ఆడుకుందని స్టేట్‌మెంట్ ఇస్తున్నారు.

మొన్న అభయ్.. ఇప్పుడు సోనియా

బిగ్ బాస్ హౌస్‌కు, బయట ప్రపంచానికి సంబంధం ఉండదు కాబట్టి చాలావరకు సంబంధం ఉండదు కాబట్టి కంటెస్టెంట్స్ కొన్నిసార్లు వాళ్లకు కావాల్సిన వాళ్లను గుర్తు చేసుకొని బాధపడడం, ఆట మీద శ్రద్ధ పెట్టకపోవడం సహజం. అలాగే సోనియా కూడా కొన్నిసార్లు ప్రవర్తించింది. కానీ తనను దగ్గర తీసుకోవడానికి అభయ్, పృథ్వి, నిఖిల్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. వీరి హగ్గుల భాగోతం చూడలేక విసుగు వచ్చేసిందంటూ ప్రేక్షకులు చాలాసార్లు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని బయటపెట్టారు. బిగ్ బాస్‌పై నెగిటివ్ కామెంట్స్ చేయడం వల్ల, రూల్స్‌ను ఎదిరించి మాట్లాడడం వల్ల గతవారం అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈవారం సోనియా కూడా వెళ్లిపోవడం మంచి విషయం అని ఆడియన్స్ ఫీలవుతున్నారు.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×