BigTV English

Subhasree Rayaguru: కోస్టార్ట్స్ ఇలా పార్ట్నర్స్ అయ్యాం.. తొలిప్రేమపై బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ!

Subhasree Rayaguru: కోస్టార్ట్స్ ఇలా పార్ట్నర్స్ అయ్యాం.. తొలిప్రేమపై బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ!

Subhasree Rayaguru: శుభశ్రీ రాయగురు (Subha Sree Rayaguru).. “మనోభావాలు దెబ్బతింటాయి” అనే డైలాగ్ తో బిగ్ బాస్ హౌస్ లో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిన్నది. అక్కడ తన అద్భుతమైన ఆట పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. కానీ చీటికిమాటికి కన్నీళ్లు పెట్టుకొని కాస్త చిరాకు తెప్పించిందని చెప్పవచ్చు. అయితే తన అందాలతో అభిమానులకు మంచి గ్లామర్ డోస్ అందించిందని చెప్పవచ్చు. అంతేకాదు ఈమె గ్లామర్ చూడడానికి కూడా షో చూసినవాళ్లు లేకపోలేదు. అంతలా అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదంతా బాగానే ఉన్నా సడన్గా నిశ్చితార్థం చేసుకొని ఆ ఫోటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.
దీంతో సుబ్బు ఏంటి ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది? అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేశారు.


సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన శుభశ్రీ రాయగురు..

అంతేకాదు ఎప్పుడు ప్రేమలో పడింది? ఈ విషయం ఎందుకు ఎవరికీ చెప్పలేదు? అసలు వీళ్ళ ప్రేమ ఎక్కడ, ఎలా మొదలైంది? అంటూ అభిమానులు కూడా ఆరా తీస్తూ ఎట్టకేలకు తన తొలి ప్రేమ పై స్పందిస్తూ కోస్టార్స్ అలా పార్ట్నర్స్ అయిపోయాం అంటూ చెప్పుకొచ్చింది. మరి శుభశ్రీ రాయగురు అలియాస్ సుబ్బు తన ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ సీజన్ 7 లో తన అందంతో అందరిని ఫిదా చేసిన సుబ్బు.. ఒడిశా కి చెందిన అమ్మాయి. తెలుగు, తమిళ్లో కొన్ని సినిమాలు కూడా చేసింది. కానీ ఈమెకు క్రేజ్ వచ్చింది మాత్రం బిగ్ బాస్ ద్వారానే. అలాంటి ఈమె తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని సడన్ సర్ప్రైజ్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


శుభశ్రీ కాబోయే వరుడు ఎవరంటే?

ప్రముఖ నిర్మాత, నటుడు అయినా అజయ్ మైసూర్ అలియాస్ ఏజే మైసూర్ తో నిశ్చితార్థం చేసుకుంది. అజయ్ మైసూర్ కొన్ని సినిమాలతో పాటు ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేశారు. ఇకపోతే వీళ్ళిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు అనే విషయంపై ప్రశ్నించడం జరిగింది.

మా తొలిప్రేమ అలా మొదలైంది..

అలా మొదలైంది అంటే తమ ప్రేమ గురించి చెప్పుకొచ్చింది శుభశ్రీ.. “సహజంగా ఎవరైనా సరే ఏదైనా వెడ్డింగ్ కి ముందు ఫోటోషూట్ చేస్తారు.. లేదా కొన్ని వీడియోలను చేసుకుంటారు.. కానీ ఫస్ట్ టైం సాంగ్ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటూ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. “మేము ఆ సాంగ్ లోనే ప్రేమలో పడ్డాము. సాంగ్ తీస్తూనే మా ప్రేమ మొదలైంది. షూటింగ్ సీక్వెన్స్ ఒకటి చేసిన తర్వాత అసలు మేము ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రేమలో పడతామని కో స్టార్స్ గా కలిసి నటించిన మేము.. ఇప్పుడు పార్ట్నర్స్ అయిపోయాము. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ జర్నీ అంతా చూస్తే మమ్మల్ని ఆ విధే కలిపిందేమో అనిపిస్తుంది. ఇదంతా ఒక మ్యాజిక్ లా జరిగిపోయింది” అంటూ అజయ్, సుబ్బు తెలిపారు.

ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఇకపోతే వీళ్ళిద్దరూ కలిసి ‘మెజిస్టీ ఇన్ లవ్’ అనే కవర్ సాంగులో నటించారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకలో ఈ పాటను లాంచ్ చేశారు. ఇది చూసిన చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ఎంగేజ్మెంట్ కి ముందు ఇలా సాంగ్ చేశారేమో అనుకున్నారు. కానీ అది ఆల్బమ్ సాంగ్ అని, ఆ సాంగ్ షూటింగ్ లోనే తామిద్దరం ప్రేమలో పడ్డామని తెలిపారు. ఇకపోతే తమ పెళ్లి జూలైలో ఉంటుందని, ఆస్ట్రేలియాలో జరుగుతుంది అని ఈ జంట తెలిపింది.

also read:Kollywood: మళ్లీ కలిసిన కమల్ – శంకర్.. నిర్మాతను ముంచడమే ధ్యేయమా?

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×