BigTV English

Kollywood: మళ్లీ కలిసిన కమల్ – శంకర్.. నిర్మాతను ముంచడమే ధ్యేయమా?

Kollywood: మళ్లీ కలిసిన కమల్ – శంకర్.. నిర్మాతను ముంచడమే ధ్యేయమా?

Kollywood:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar ) ఒకప్పుడు ‘భారతీయుడు’, ‘రోబో’ వంటి చిత్రాలను తెరకెక్కించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా ఆయన తీసిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. అటు ‘భారతీయుడు 2’ అయితేనేం ఇటు ‘గేమ్ ఛేంజర్ ‘ అన్ని కూడా భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ గానే నిలిచాయి. అయితే ఇప్పుడు మళ్లీ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు అనే మాట వినగానే అటు నిర్మాతలు కూడా ముందడుగు వేయడం లేదు. దీనికి తోడు కమలహాసన్ (Kamal Haasan), శంకర్ కాంబినేషన్లో మళ్లీ సినిమా అనేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతను ముంచడమే మీ ధ్యేయమా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.


మళ్లీ కలవబోతున్న శంకర్ – కమల్ హాసన్..

డైరెక్టర్ శంకర్ కే కాదు ఇటు స్టార్ హీరో కమల్ హాసన్ కి కూడా ఈ టైం పెద్దగా కలిసి వచ్చినట్టు అనిపించడం లేదు. ఎందుకంటే శంకర్ డైరెక్షన్లో చేసిన భారతీయుడు 2, ఇటు మణిరత్నం(Maniratnam ) దర్శకత్వంలో దాదాపు 38 ఏళ్ల తర్వాత తీసిన ‘థగ్ లైఫ్’ రెండూ కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. నిజానికి థగ్ లైఫ్ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కమలహాసన్. ఒకవేళ ఈ సినిమా ఫలితం బాగా ఉండి ఉంటే.. దీపావళి లేదా దసరా సీజన్లో శంకర్ డైరెక్షన్లో ఇండియన్ 3 ని కూడా విడుదల చేయాలని అనుకున్నారట. కానీ పరిస్థితులు కుదరకపోవడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పూర్తిగా హోల్డ్ లో పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది.


నిర్మాతకు నష్టం తప్పదా?

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఇండియన్ 3 థియేటర్లను సందర్శించే అవకాశం కంటే.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ కే నేరుగా అమ్మే ఆలోచనలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. నిజానికి బాక్స్ ఆఫీస్ వద్ద శంకర్ బ్రాండ్ విలువ తగ్గిపోవడం, ఇటు కమలహాసన్ కూడా వరుసగా కమర్షియల్ ఫలితాలలో వెనుకబడడంతో.. ఒకవేళ మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తే నిర్మాతకు నష్టం తప్ప మిగిలేది ఏమీ లేదు. అందుకే ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఓటీటీ లో రిలీజ్ చేయాలనుకున్నా కూడా.. మంచి డీల్ రాకపోతే ఆ సినిమాకి పెట్టుబడులు తిరిగి రాకుండా పోవచ్చు అని కూడా ట్రేడ్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా పునరాలోచన చేస్తారా?

మొత్తానికి అయితే భారతీయుడు 3 సినిమా అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలో రెండింటిలో కూడా విడుదల చేయడం వృధానే అని ఒక వర్గం ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఎక్కడ రిలీజ్ చేసినా అనుకున్న డీల్ కుదరకపోతే మాత్రం నిర్మాతకు భారీ నష్టం మిగులుతుంది. కనీసం ఇప్పటికైనా నిర్మాతల కష్టాలను దృష్టిలో పెట్టుకొని సినిమాను నిర్మిస్తే బాగుంటుందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇన్ని ఫ్లాప్ లు ఎదురవుతున్న సమయంలో కనీసం ఇప్పటికైనా అటు కమల్ హాసన్ ఇటు శంకర్ పునరాలోచన చేసి సినిమా కథలో మార్పులు తీసుకొచ్చి, ప్రేక్షకుడి ఆలోచనలకు తగ్గట్టుగా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుంది. మరి శంకర్ – కమలహాసన్ ఏం చేస్తారో చూడాలి.

also read:HHVM: ఫ్యాన్స్ ఆశలు వదులుకోండి.. మరో 65 ఏళ్ల తర్వాతే రిలీజ్!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×