E-Paper
Advertisement

Bigg Boss 9: బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటూ టార్గెట్.. పాపం ఇకనైనా తనూజని వదిలేస్తారా?

Bigg Boss 9: బిగ్ బాస్ ముద్దుబిడ్డ అంటూ టార్గెట్.. పాపం ఇకనైనా తనూజని వదిలేస్తారా?
Advertisement

Bigg Boss 9: బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్ లో తనూజ ఒకరు. టాప్ 5 మాత్రమే కాదు ఈ సీజన్ విన్నర్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. హౌజ్ లో ఆమెకు ఫేవరిటిజం ఉందనేది చాలా మంది అంటున్న మాట. బయట మాత్రమే హౌజ్ లోని కంటెస్టెంట్స్ ది కూడా ఇదే అభిప్రాయం.

ఇక బయట తనూజకి ఎంత సపోర్టు ఉందో అదే స్థాయిలో నెగిటివిటీ కూడా ఉంది. తనూజని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో కుప్పలు కుప్పలుగా వీడియోలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఇదంత మిగతా కంటెస్టెంట్స్ పీఆర్ టీమ్ పని కూడా అనుకోండి. కానీ, తనూజ గొడవలు, భరణితో బాండింగ్ కాస్తా నెగిటివిటీ కూడా ముటగట్టుకుంది. పైగా హౌజ్ లో అందరి కంటే తనూజనే బిగ్ బాస్ స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది. పైగా ఈసారి బిగ్ బాస్ టైటిల్ కూడా ఈ ముద్దుబిడ్డదే అని అందరు నమ్ముతున్నారు.

అందరికీ టార్గెట్

Advertisement

ఈ క్రమంలో తనూజ అందరి టార్గెట్ అవుతుంది. పైగా భరణితో బాండింగ్, ఆటల్లో సపోర్టుతో తనూజ అసలు గేమ్ ఆడట్లేదు.. అయినా టాప్ లో ఎలా ఉంటుందంటూ ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే వాటన్నింటికి ఈ వారంతో చెక్ పెట్టింది తనూజ.

ఈ వారం బీబీ రాజ్యం అంటూ బిగ్ బాస్ కింగ్స్, క్వీన్స్, కమాండర్స్, సామన్య ప్రజలను అంటూ కంటెస్టెంట్స్ ని డివైడ్ చేశాడు. అయితే ఈ టాస్క్ ల్లో తనూజ క్వీన్ కాకుండ కమాండర్ గా ఉంది. తనతో కమాండర్స్ గా ఉన్నవాళ్లంత తనూజకి యాంటినే. దివ్యని క్వీన్ చేశాడు.

Advertisement

భరణిని ప్రజల్లో పడేసి తనూజ కి సపోర్టు లేకుండ చేశాడు బిగ్ బాస్. అంత ఫెవరిటిజం ఉంటే తనూజని క్వీన్ చేయాలి. కానీ బిగ్ బాస్ అలా చేయలేదు. పైగా మొదటి రోజు కూడా ఆమెకు టాస్క్ ఆడే అవకాశం రాలేదు. కానీ, ఈ సారి ఒంటరిగా కెప్టెన్సీ కోసం పోరాడింది. ఈ పోరులో ఒక్కొక్కొ స్టేజ్ ఎక్కుతూ పదోవారం కెప్టెన్ గా నిలిచింది.

తనుజ గట్టి సమాధానం

ఇంతకాలం సపోర్టు ఆడిందని, తను కెప్టెన్ గా అనర్హురాలంటూ విమర్శించిన వారికి తనూజ ఈ వారంతో గట్టి సమాధానం ఇచ్చింది. ఎవరి సపోర్టు లేకుండ తన ఇండీవిజువ్వల్ గా గేమ్ ఆడి కెప్టెన్ అయ్యింది. మరి ఇకనైనా తనూజపై ట్రోల్స్ ఆగుతాయో లేదో చూడాలి. పైగా బిగ్ బాస్ ఫెవరిటిజం చూపిస్తున్నాడని అన్నారు.

కానీ, ఈ వారం బిగ్ బాస్ అసలు తనూజకు సపోర్టుగా, ఆమె కెప్టెన్ అయ్యేలా విధంగా ఎలాంటి టాస్క్ ఇవ్వలేదు. పైగా ఇందులో ప్రతి స్టేజ్ నిర్ణయం కూడా హౌజ్ మేట్స్ చేతుల్లోనే పెట్టాడు. మరీ ఇప్పటికైనా ట్రోలర్స్ తనూజ టార్గెట్ చేయడం ఆపేస్తారో లేదో చూడాలి.

Also Read: Bigg Boss 9: వరస్ట్ కే వరస్ట్ దివ్య.. నన్నేందుకు ఎత్తుకోలేదని భరణిపై అలక

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Big Stories

Advertisement
×