Mohan Lal:మోహన్ లాల్ (Mohan Lal).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ వివిధ భాషా హీరోల చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అలా పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఎంతోమంది అభిమానుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. అయితే అలాంటి ఈయన సడన్ గా తనను కొంతమంది ద్వేషిస్తున్నారు అని, శత్రువులా చూస్తున్నారని చెప్పిన మాటలు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి మోహన్ లాల్ ను ఎవరు శత్రువులా చూస్తున్నారు? ఎందుకు ఆయన అంతలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అసలేం జరిగింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
అసలు విషయంలోకి వెళ్తే.. మలయాళం సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో AMMA కి అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే 2027లో జరగాల్సిన ఎన్నికలు ఆయన రాజీనామా చేయడంతో ఇటీవల పూర్తయ్యాయి. దీనికి తొలి మహిళ అధ్యక్షురాలుగా ప్రముఖ నటి శ్వేతా మీనన్ (Swetha Menon)బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కొత్త నిర్వాహక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాను, తను నాయకత్వం వహించిన నిర్వాహక కమిటీలోని ఇతర సభ్యుల గురించి కూడా మోహన్ లాల్ మాట్లాడుతూ.. “ఎందుకో తెలియదు సడన్గా చాలామంది నాకు శత్రువులయ్యారు. అసోసియేషన్ సభ్యులలో ఎటువంటి అహంకారం లేదు కానీ ఒకానొక సమయంలో నేను, నా కమిటీ విపరీతమైన విమర్శలు ఎదుర్కొన్నాము.. వారే ఇప్పుడు నన్ను శత్రువులా చూస్తున్నారు”.. అంటూ తెలిపారు.
also read:Allu Aravind : హైదరాబాద్‌లో అక్రమ కట్టడం… అల్లు అరవింద్‌కు నోటీసులు!
ఇప్పటికీ ఆ కారణం తెలియలేదు – మోహన్ లాల్
దీనిపై ఆయన మాట్లాడుతూ..” అధ్యక్షుడు అనేది ఒక పదవి మాత్రమే. ఏదైనా ఒక సంస్థలో సమస్య ఉంది అంటే దానికి అధ్యక్షుడే కారణమా.. నాపట్ల శత్రుత్వం పెంచుకుంటున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే దీనిపై నేనింకా స్పష్టత ఇవ్వలేను. కానీ అందరూ నన్ను ప్రేమిస్తున్నారని కూడా నేను చెప్పలేను. ఏదేమైనా నాపట్ల ఆ శత్రుత్వం ఎందుకు పెంచుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ లాల్. మరి మోహన్ లాల్ పట్ల శత్రుత్వం కనబరుస్తున్న ఆ కమిటీ మెంబర్స్ ఎవరు? అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.
‘అమ్మ’ కి రాజీనామా చేయడంపై క్లారిటీ..
రాజీనామా చేయడంపై మోహన్ లాల్ మాట్లాడుతూ.. ఆ అధ్యాయానికి పూర్తి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని భావించడంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. జస్టిస్ హేమా కమిటీ మలయాళం సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన విషయాలను కనుగొన్న తర్వాత అప్పటి ప్రధాన కార్యదర్శి సిద్దిక్, జాయింట్ సెక్రెటరీ బాబు రాజ్ వంటి కీలక కార్యనిర్వాహక సభ్యులపై లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించిన అనేక ఆరోపణలు వచ్చాయి. అందుకే నేను ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది” అంటే ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న మహిళ అధ్యక్షురాలి న్యాయకత్వం వర్ధిల్లాలి అని అక్కడ ఏదైనా సమస్య వస్తే అండగా నిలబడతాము అని కూడా హామీ ఇచ్చారు మోహన్ లాల్. ప్రస్తుతం మోహన్ లాల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.