Bigg Boss: ఈమధ్య కాలంలో సెలబ్రిటీల ఇళ్లను టార్గెట్ చేసుకొన.. వాళ్ళ ఇంట్లో పనికి చేరి.. ఆ తర్వాత దోపిడీకి పాల్పడుతున్న విషయం తెలిసిందే..ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీ ఇళ్లల్లో పని కుదుర్చుకొని.. నమ్మిన బంటు లాగా మారి, ఆ తర్వాత వారిని మోసం చేస్తూ లక్షల రూపాయలను కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఈ మేరకు ఆమె పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ కారణంగా అసలు విషయం వెలుగు చూసింది.
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంట్లో దొంగతనం..
అసలు విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ 18 కంటెస్టెంట్ కాశీష్ కపూర్ ఇంట్లో చోరీ జరిగింది. ముంబైలోని అంధేరీలో ఉన్న ఆమె నివాసంలో దొంగతనం జరిగింది. ఆమె నివాసం నుంచి రూ.4.5 లక్షల నగదు దోపిడీకి గురైంది. దోపిడీ జరిగినప్పటి నుంచి ఆమె ఇంటి పనిమనిషి సచిన్ కుమార్ చౌదరి కనిపించకుండా పోయారు. ఈ మేరకు సచిన్ తన అల్మారా నుంచి డబ్బు దొంగిలించాడని పోలీసులకు కాశీష్ కపూర్ చెప్పడంతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాశీష్ కపూర్ కెరియర్..
ఆశిష్ కపూర్ విషయానికి వస్తే.. బీహార్ లోని పూర్ణియాకు చెందిన ఈమె ఒక మధ్య తరగతి కుటుంబంలో పెరిగింది. డిసెంబర్ 1 2000 సంవత్సరంలో జన్మించింది. ఈమె వయసు ప్రస్తుతం 24 సంవత్సరాలు. ఇక ఈమె విషయానికి వస్తే ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి పేరు సొంతం చేసుకుంది. నటి మాత్రమే కాదు టెలివిజన్ నటిగా కూడా పేరు దక్కించుకుంది. ఇకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఎనిమిది లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను ఇంస్టాగ్రామ్ ద్వారా కలిగి ఉంది. అటు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
వివాదాల్లో చిక్కుకున్న కాశిష్ కపూర్..
ఇకపోతే ఈమె MTV రౌడీ డబల్ ఎక్స్ షో లో కనిపించింది అలాగే స్ప్లిట్స్ విల్లా X5 లో పోటీదారుగా పాల్గొని అక్కడ తన ప్రవర్తనతో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.డబ్బు కోసమే పోటీ నుండి తప్పుకుంది అనే విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇక అంతే కాదు సైబర్ క్రైమ్ బెదిరింపులతోపాటు భారీ ట్రోల్లింగ్ కూడా ఎదుర్కొంది.
ALSO READ:Anirudh Ravichander నాకు 30 ఏళ్లు.. ఇకపై జాగ్రత్తగా ఉండాలి