Anirudh Ravichander :మ్యూజిక్ సెన్సేషన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సొంతం చేసుకున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander). ధనుష్(Dhanush), శృతిహాసన్ (Shruti Haasan) కాంబినేషన్ లో వచ్చిన ‘3’ సినిమాలో ఈయన స్వరపరిచిన “వై దిస్ కొలవరి ఢీ” పాట ఈయనకు మంచి ఇమేజ్ అందించింది. 1990 అక్టోబర్ 16న తమిళనాడు మద్రాస్ లో జన్మించిన ఈయన గాయకుడిగా, సంగీత దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇకపోతే చెన్నైలోని లయోలా కాలేజ్ నుండి డిగ్రీ పూర్తి చేసిన ఈయన ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్నారు.
ఇకపై నేను జాగ్రత్త పడాలి..
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిరుద్.. నాకు 30 ఏళ్లు వచ్చేసాయి. ఇకపై జాగ్రత్తగా ఉండాలి అంటూ తన మనసులో మాటగా చెప్పుకొచ్చారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న అనిరుద్ రవిచందర్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ, జైలర్ 2 చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అనిరుద్ మాట్లాడుతూ.. “నేను పని ఒత్తిడి కారణంగా ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయంలో నిద్రపోతున్నాను. ఇప్పుడు నాకు 30 ఏళ్లు వచ్చాయి. దీనివల్ల నేను ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకే ఇకపై నా వర్కింగ్ స్టైల్ ను మార్చేయాలని అనుకుంటున్నాను” అంటూ తెలిపారు అనిరుద్. మొత్తానికైతే రాత్రిళ్ళు కూడా కష్టపడి పని చేయడం ఇకపై కుదరదు అని ఆరోగ్యం ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిరుధ్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
ఇప్పటికీ ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్న అనిరుద్..
ఇదిలా ఉండగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సీఈవోగా వ్యవహరిస్తున్న కావ్య మారన్ తో అనిరుద్ కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు సృష్టించారు. దీంతో కోలీవుడ్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అటు సామాజిక మాధ్యమాలలో కూడా వీరిద్దరి రిలేషన్ పై చర్చ జరిగింది. ఇక రోజు రోజుకి వార్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరు కూడా స్పందించకపోవడంతో రూమర్స్ నిజమే అనుకున్నారు. కానీ ఇవి అనిరుద్ వరకు చేరడంతో ఆయన స్పందించారు. “కావ్య మారన్ తో నాకు పెళ్లా? రూమర్స్ ప్రచారం ఆపండి” అంటూ సోషల్ మీడియా వైదికగా వార్తలను ఖండించారు. కావ్య మారన్ విషయానికి వస్తే.. ఆమె సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో మైదానంలో తనదైన హావ భావాలతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక కళానిధి నిర్మించిన జైలర్, బీస్ట్,రాయన్ తదితర చిత్రాలకు అనిరుద్ సంగీతం అందించారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని.. రహస్యంగా వెకేషన్ లోకి వెళ్తున్నారని.. అందుకే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు సృష్టించారు.
ALSO READ:Kota Srinivas Rao Demise: కోటా మరణం.. సోషల్ మీడియా వేదికగా ప్రముఖుల సంతాపం!