Bigg Boss Srija: దమ్ము శ్రీజ (Srija Dammu) .. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9లో కామన్ మ్యాన్ కేటగిరీలో అవకాశాన్ని దక్కించుకుంది. నిజానికి అగ్ని పరీక్ష షోలో పిట్ట కొంచెం కూత ఘనం అనే రేంజ్ లో జడ్జ్లను కూడా తికమక పెట్టేసి.. తన ప్రశ్నలతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈమె.. అద్భుతమైన టాస్క్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది.. నచ్చింది చేస్తూ ..నచ్చనిది ప్రశ్నిస్తూ.. భారీ పాపులారిటీ అందుకున్న శ్రీజ…హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక టాస్కుల్లో చురుగ్గా పాల్గొని..తోటి కంటెస్టెంట్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. చివరి రెండు వారాలలో తన పెర్ఫార్మెన్స్ తో అబ్బురపరిచిన ఈమె గయ్యాళి తనం ఆడియన్స్ కి కూడా నచ్చలేదు.దీంతో ఈమెను ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు.
అలా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఈమె.. ఈ ఊహించని ఎలిమినేషన్ ఈమెను ఇంకా తేరుకునేలా చేసినట్లు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఎమోషనల్ వీడియోని పంచుకుంది శ్రీజ. బిగ్ బాస్ కోసం జాబ్ కూడా వదిలేసానని.. ఇప్పుడు త్వరగా ఎలిమినేట్ అవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక వీడియో రిలీజ్ చేస్తూ..”నేను బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదు. అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి ఇంటికి వచ్చాక.. ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. కనీసం దీపావళి సెలబ్రేషన్స్ టైం లో హౌస్ లో నేను ఉండాల్సింది కదా అనిపిస్తోంది. అటు హైపర్ ఆది పేరడీ చేస్తుంటే నేను హౌస్ లో లేనని మరింత బాధగా అనిపిస్తోంది. అగ్నిపరీక్ష దాటేందుకు చాలా కష్టపడ్డాను. ఐదు లెవెల్స్ దాటుకొని అక్కడి వరకు వెళ్లాను. బిగ్ బాస్ కోసం ఒక పెర్మనెంట్ టాటూను కూడా నేను వేయించుకున్నాను.
ఆఖరికి ఈ షో కోసం ఉన్న జాబ్ కూడా వదులుకున్నాను. గెలుపు కోసం 100% ప్రయత్నం చేశాను. కానీ నాకు అదృష్టం కలిసి రాలేదు. ఎలిమినేషన్ రౌండ్ లో కూడా ప్రతి టాస్క్ లో చివరి వరకు వెళ్లాను. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ లో నాలాగా ఎవరు ఎలిమినేట్ కాలేదు. పైగా నాకోసం ఏవి కూడా వెయ్యలేదు. ఇలా ఐదు వారాలు హౌస్ లో ఉన్నా.. నా జర్నీ లేకుండా బయటకు రావడం చాలా బాధగా ఉంది” అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో షేర్ చేసింది శ్రీజ.
ఇది చూసిన నెటిజన్లు ఎంతోమందికి స్ఫూర్తి నువ్వు.. బాధపడకు అని కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మళ్ళీ శ్రీజాను బిగ్ బాస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేలా నిర్వాహకులకు మెసేజ్లు కూడా పెడుతున్నట్లు సమాచారం మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆ ఎలిమినేషన్ నుంచి శ్రీజ ఇంకా బయటపడలేకపోతోందని స్పష్టం అవుతోంది.
ALSO READ: K-Ramp: కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్!
?utm_source=ig_web_copy_link