Team India : సాధారణంగా క్రికెట్ రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గల్లీ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు చిన్న చిన్న గొడవలు, వివాదాలు నిత్యం చూస్తూనే ఉంటాం. కౌంటర్ కి ప్రతి కౌంటర్.. అతను అలా చేశాడని.. ఇతను ఇలా చేయడం ఆనాటి కాలం నుంచి వస్తున్నదే. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమిండియా కి వరల్డ్ కప్ ఇవ్వకపోయినా 2011లో భారత జట్టు వరల్డ్ కప్ సాధించిందంటే కారణం అతనే అని గర్వంగా చెప్పవచ్చు. తాను తయారు చేసిన ఆటగాళ్లే 2011 లో అద్బుతంగా ఆడి విజయం సాధించారు. ముఖ్యంగా 2002లో గంగూలీ కెప్టెన్సీలో నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ లో భారత జట్టు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ అద్భుతమైన భాగస్వామ్యంతో భారత్ విజయం సాధించింది.
లార్డ్స్ లో గంగూలీ సంబురాలు..
ఆ సందర్భంలో సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పి సంబురాలు జరుపుకున్నాడు. అప్పట్లో ఈ ఘటన సంచలనమనే చెప్పాలి. వాస్తవానికి గంగూలీ అలా చేయడానికి కూడా ఓ కారణం ఉందండోయ్. అంతకంటే ఇంగ్లాండ్ జట్టు భారత్ పై విజయం సాధిస్తే.. ఆండ్రు ఫ్లింటప్ షర్ట్ విప్పి మరీ రచ్చ చేశాడు. ఇక దానికి కౌంటర్ గా 2002లో టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా షర్ట్ విప్పి బాల్కనీ పై సంబురాలు చేసుకున్నాడు. వాస్తవానికి టీమిండియా మొత్తం సంబురాలు జరుపుకోవాలని భావించిందట. కానీ సచిన్ టెండూల్కర్ అందరూ చేస్తే.. బాగుండదని చెప్పాడట. దీంతో కేవలం గంగూలీ మాత్రమే ఇలా చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అసలు విషయం వెల్లడించిన రాజీవ్ శుక్లా
అప్పట్లో భారత జట్టుకి మేనేజర్ గా ఉన్న బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆ వేడుకకు సంబంధించి తాజాగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ఆ సమయంలో భారత్ 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించగలుగుతుందా అనే అనుమానాలు కలిగాయి. తాను చాలా టెన్షన్ వాతావరణం ఉండటంతో బీపీ టాబ్లెట్ కూడా వేసుకున్నట్టు గుర్తు చేశాడు. గంగూలీ మాత్రం సార్ మనం మైదానంలోకి వెళ్దామని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. భారత జట్టు విజయానికి చేరువలో ఉండగా.. గంగూలీ జట్టుతో కలిసి షర్ట్ విప్పి సంబురాలు చేయాలని కోరాడట. కానీ అంతకు ముందు ముంబైలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాప్ కూడా ఇలాగే షర్ట్ విప్పి సంబురాలు చేసుకున్నాడు. అతనికి కౌంటర్ ఇవ్వాలని గంగూలీ ప్లాన్ చేశాడు. కానీ సచిన్ చేయవద్దని సూచించడంతో.. కేవలం గంగూలీ ఒక్కడూ మాత్రమే చేశాడని వెల్లడించారు రాహుల్ శుక్లా. భారత క్రికెట్ కొత్త శకానికి నాంధి పలికిందనే చెప్పవచ్చు. అప్పటి నుంచి భారత జట్టు పుంజుకొని.. విజయాలు, అపజయాలు సాధిస్తూ దూసుకెళ్తోంది. తాజాగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.