BigTV English

BB Telugu 8: ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈసారి కూడా..?

BB Telugu 8: ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఈసారి కూడా..?

BB Telugu 8:తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డ్స్ ఎప్పుడైతే అడుగుపెట్టారో గేమ్ కూడా వైల్డ్ ఫైర్ లా మారిపోయింది. మొత్తం 22 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్ లో పాల్గొనగా.. ప్రస్తుతం 5 మంది ఫైనల్ కి వచ్చారు. నిఖిల్, గౌతమ్ మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వీరి తరువాత లేడీ శివంగిలా ఆట ఆడుతూ తనదైన శైలిలో అందరినీ మెప్పించి మూడవ స్థానానికి చేరుకుంది ప్రేరణ. ఆ తర్వాత నబీల్, అవినాష్..అవినాష్ ఎలాగో ఈరోజు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఇచ్చే ఆఫర్ రూ.10లక్షలను తీసుకొని వెళ్ళిపోతారనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఇకపోతే మిగతా సీజన్ లతో పోల్చుకుంటే ఈ సీజన్ కాస్త డిఫరెంట్ గానే సాగింది. కంటెస్టెంట్స్ అందరూ కూడా తమ ఆట తీరుతో అందరిని మెప్పించారు. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమంలో విజేతకి పుష్ప 2 సినిమాతో రూ.1000 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించారు అల్లు అర్జున్. ఇలాంటి హీరో షో స్టేజ్ పైకి వస్తే షో యొక్క క్రేజ్ మరింత పెరుగుతుందని బిగ్ బాస్ నిర్వహకులు ఆలోచించారని, అందులో భాగంగానే బన్నీ ఈ స్టేజ్ పైకి వచ్చి విజేతకి టైటిల్ ట్రోఫీతో పాటు, ప్రైజ్ మనీ క్యాష్ చెక్కు కూడా ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.

అయితే అల్లు అర్జున్ రాబోతున్నాడని అన్ని ఏర్పాట్లు చేసుకోగా సడన్గా ఆయన హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మద్యంతర బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి రావడానికి ఆసక్తి చూపించలేదని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఇకపోతే నాగార్జున చేతుల మీదుగానే ఈసారి కూడా విజేతకి ట్రోఫీ అందించబోతున్నారట. ఇక గత సీజన్లో కూడా మహేష్ బాబు ముఖ్యఅతిథిగా వస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన కూడా రాలేదు. అందుకే నాగార్జున చేతుల మీదుగానే పల్లవి ప్రశాంత్ కి ట్రోఫీతో పాటు క్యాష్ చెక్ కూడా అందజేశారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ వస్తారు అనుకోగా ఆయన కూడా హ్యాండ్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఈసారి కూడా విజేతకి నాగార్జున చేతుల మీదుగానే ట్రోఫీతో పాటు చెక్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా నిఖిల్, గౌతమ్ టైటిల్ రేస్ లో పోటీ పడుతున్నారు. అటు ఓటింగ్ లో కూడా పెద్దగా తేడా కనిపించడం లేదు మరి ఇద్దరిలో ఎవరికి టైటిల్ ఇస్తారు అనే విషయం మరింత ఉత్కంఠగా మారింది.ఏది ఏమైనా ఈసారి మాత్రం చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తోందని చెప్పవచ్చు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×