Actor Nani : రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఇష్యూ తర్వాత ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ఒకవైపు తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్తూనే తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిన్న సమస్యలు కూడా రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా 2024 వ సంవత్సరంలో వచ్చిన సినిమా న్యూస్ లు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ముందుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. తన దగ్గర పనిచేసిన ఒక లేడీ కొరియోగ్రాఫర్ జానీ పైన కేసు వేశారు. ఈ కేసులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొన్నాడు జానీ మాస్టర్. ఆఖరికి జైలుకు కూడా వెళ్ళాడు జానీ. ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ మీద ఉన్న ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఇకపోతే మంచు మోహన్ బాబు కుటుంబ వ్యవహారం గురించి ఎక్కడ చూసినా మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లలో వాళ్లకు ఆస్తి తగాదాలు ఉన్నాయి అని వార్తలు వచ్చాయి. రెండేళ్ల క్రితం మనోజ్ ఇంటికి వచ్చి విష్ణు తన మనుషులపై దాడి చేశాడు అని ఒక వీడియో రిలీజ్ అయింది. అది ఒక రియాలిటీ షో అంటూ అప్పట్లో మంచు విష్ణు దానిని కవర్ చేసే ప్రయత్నం చేశారు. చాలామంది నిజంగానే నమ్మారు. కానీ ఇప్పటికీ ఆ రియాలిటీ షో విడుదల కాలేదు. ఇకపోతే వారి మధ్య గొడవలు రీసెంట్ టైమ్స్ లో తారాస్థాయికి చేరాయి. తెలుగు మీడియా అంతా కూడా ఆ గొడవలను కవర్ చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా మోహన్ బాబు అనుకోని విధంగా ఒక జర్నలిస్టు పైన దాడి చేయడం అనేది దీనిని తారాస్థాయికి తీసుకెళ్ళింది. ఇకపోతే ఈ వ్యవహారం జరుగుతుండగానే అల్లు అర్జున్ వ్యవహారం ఒకటి ఇంకా హైలైట్ అయింది.
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ప్రీమియర్ షో చూడడానికి హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి వెళ్ళాడు అల్లు అర్జున్. అక్కడ అల్లు అర్జున్ రావడంతో అధిక సంఖ్యలో జనాలు వచ్చి తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ మృతి చెందారు. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి, ఆ తరువాత వైద్య పరీక్షలు చేయించి చంచల్గూడా జైలుకు పంపారు. గత రాత్రి జైలులోనే గడిపాడు అల్లు అర్జున్. ఒక మీడియా అంతా ఇదే అంశాన్ని కవర్ చేస్తూ ఉండిపోయింది. ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమా ఈవెంట్ ఒకటి రీసెంట్ గా జరిగింది. ఈ ఈవెంట్లో నాని మాట్లాడుతూ మీడియాని ఉద్దేశిస్తూ నిన్నటి నుంచి బాగా బిజీగా ఉన్నట్లున్నారు అంటూ చెప్పుకొచ్చాడు. నిన్నటి నుంచి మీడియా అంతా ఏ వార్తను కవర్ చేసింది అనే విషయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మొదట నాని ట్విట్టర్ వేదిక ట్వీట్ కూడా వేశాడు. ఇప్పుడు ఇలా మీడియాపై కూల్ గా నవ్వుతూ సెటైర్ వేశాడు నాని.
Also Read : Allu Arjun – Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను బన్నీ బాబాయ్ అని ఎందుకు పిలుస్తాడో తెలుసా.?