BigTV English

Rahul Gandhi : మాది ప్రజాస్వామ్యవాదం.. మీది మనువాదం. బీజేపీపై లోక్ సభలో రాహుల్ విమర్శలు

Rahul Gandhi : మాది ప్రజాస్వామ్యవాదం.. మీది మనువాదం. బీజేపీపై లోక్ సభలో రాహుల్ విమర్శలు

Rahul Gandhi : భారత రాజ్యాంగ విలువలను అర్థం చేసుకోవడంలో, వాటిని అమలు చేయడంలో అధికార బీజేపీ విఫలమయ్యిందంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. స్వాతంత్ర్య సమయంలో మేధావుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. లోక్ సభలో ప్రత్యేక చర్చా కార్యక్రమం చేపట్టారు. ఈ చర్చలో ప్రసంగించిన రాహుల్ గాంధీ అధికార ఎన్డీఏ పై నిప్పులు చెరిగారు. వివిధ అంశాలను ప్రస్తావించిన రాహుల్.. బీజేపీ, కాంగ్రెస్ ఆలోచన విధానాలకు వ్యత్యాసాలను తెలియజేశారు.


ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేసే భారత రాజ్యాంగాన్ని బీజేపీ అమలు చేయడం లేదని, హిందూత్వ సిద్ధాంతకర్త వీరసావర్కర్ ఆలోచనలను మాత్రమే అనుసరిస్తోందంటూ విమర్శించారు. భారత్లో రాజ్యాంగానికి బదులు మనస్మృతిని అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. భారత రాజ్యాంగం, మనుస్మృతి మధ్య చాలా వైరుధ్యం ఉందని వివరించిన రాహుల్ గాంధీ.. బీజేపీ నాయకత్వం మనుస్మృతిని వీడి రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు. ఇప్పుడు భారత రాజ్యంగం గురించి సభలో బీజేపీ నాయకులు పొగడ్తలు కురిపిస్తున్నారని కానీ.. వారి సిద్ధంతకర్త వీర సావర్కర్ ఆలోచనలు అందుకు భిన్నమని వ్యాఖ్యానించారు. దేశ రాజ్యాంగం మనువాదానికి అనుగుణంగా ఉండాలని.. హిందుత్వ సిద్ధాంత కర్త వీర సావర్కర్ విశ్వసించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. కానీ.. రాజ్యాంగం తెరిచినప్పుడు అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూల ఆలోచనలు, వారి అభిప్రాయాలు అందులో కనిపిస్తున్నాయని తెలిపారు.

భారత రాజ్యాంగంపై చర్చ సందర్భంగా శుక్రవారం నాడు పార్లమెంట్ లో ప్రసంగించిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. కాంగ్రెస్ విధి విధానాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరు దుర్మార్గమని వ్యాఖ్యానించిన కిరణ్ రిజిజు.. చారిత్రక లోపాలను దాచిపెట్టి రాజ్యాంగ అంశాలను ఎంపిక చేశారంటూ ఆరోపించారు. కిరణ్ రిజిజు వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఆధునిక భారతావనికి దిక్సూచి వంటిది అన్న రాహుల్ గాంధీ.. అందులో ప్రాచీన భారతీయ విలువలకూ స్థానం కల్పించారని వ్యాఖ్యానించారు.


ఎన్డీయే ప్రభుత్వ విధానాల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువత జీవితం నాశనం అవుతుందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని కీలక రంగాలను పారిశ్రామికవేత్తల చేతుల్లో పెట్టడం ద్వారా యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని అన్నారు. దేశంలోని వనరులు, సంపదలను కొంతమంది పారిశ్రామిక వేత్తలకు దోచిపెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 70 కి పైగా పరీక్షా పేపర్లు లీకయ్యాయని తెలిపిన రాహుల్ గాంధీ.. ఈ కారణంగా ప్రతిభావంతులైన వేలాది మంది ఉద్యోగాలు సాధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పరీక్షలు నిర్వహించడం, పేపర్లో లీక్ అయ్యేలా వ్యవస్థలను నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. దీనంతటికి బాధ్యతలు ఎవరని ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు బీజేపీ వెనకాడుతోందన్నారు.

Also Read : ఎర్రకోట మాది.. మాకిచ్చేయండి అంటూ దిల్లీ హైకోర్టులో పిటిషన్

ఇటీవల తాను హత్రాస్ సామూహిక అత్యాచార బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించిన విషయాన్ని గుర్తు చేసిన రాహుల్ గాంధీ.. నేరానికి పాల్పడిన వారు ఇప్పటికీ నిర్భయంగా వీధుల్లో తిరుగుతున్నారని అన్నారు. కానీ దుర్మార్గుల చేతులు చిక్కి తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులు మాత్రం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగం రక్షణ కల్పిస్తోందని.. అలాంటి పవిత్ర రాజ్యాంగంపై భారతీయ జనతా పార్టీ నిరంతరం దాడి చేస్తూనే ఉంటుందని రాహుల్ ఆరోపించారు.

Related News

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Big Stories

×