Inaya Sultana : బిగ్ బాస్ హాట్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఆమె ఏం చేస్తుందో చాలామందికి తెలియదు కానీ.. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఒక్కసారిగా క్రేజీ బ్యూటీగా మారిపోయింది.. ఈమధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటుగా యూట్యూబ్ ఛానల్ కి కూడా ఇంటర్వ్యూ ఇస్తూ బిజీగా ఉంది.. మరోవైపు చేతినిండా సినిమాలతో పాపులారిటీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి వచ్చిన ట్రోల్స్ కి దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్పింది. ఇంతకీ ఇనయా గురించి వచ్చిన ట్రోల్స్ ఏంటి..? ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇనయా సుల్తానా కో యాంకర్ గా వ్యవహరించారు.. ఈ సమయంలో తన వాయిస్‌పై వచ్చిన ట్రోల్స్ గురించి ఆమె చెప్పిన మాటలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆమె వాయిస్ పై వచ్చిన ట్రోల్స్ ఆమెను మానసికంగా బాధించాయి అని తెలుస్తుంది.. ఈసారి ఆమె ఆ విమర్శలను తనదైన స్టైల్ లో తిప్పికొట్టింది. తనపై వచ్చిన ట్రోల్స్ కి గతంలో వీడియో కూడా షేర్ చేసింది. అందులో మాట్లాడుతూ ట్రోలర్స్ కి గట్టిగానే షాక్ ఇచ్చింది.. ప్రస్తుతం ఇది మరోసారి సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. నాకు చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. ముఖ్యంగా నా వాయిస్ గురించి నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేదాన్ని.. అందుకే వాయిస్ అలా వచ్చింది ఇప్పుడైతే పర్వాలేదు కానీ ఇప్పుడు ఏ షో అయినా అనర్గళంగా చేయగలను అని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారింది..
Also Read : ఓటీటీ లోకి వచ్చేసిన రొమాంటిక్ స్టోరీ మూవీ.. తెలుగులో ఎక్కడ చూడచ్చంటే..?
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా ప్రస్తుతం తన కెరియర్ ని బిజీగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందే.. అయితే గతంలో ఆమె ఓ వ్యక్తిని ప్రేమించి మోసపోయానని తనకు బ్రేకప్ చెప్పిన విషయాన్ని బయటపెట్టింది.. ఆ తర్వాత ఆమె ఫిజిక్ పై ఫోకస్ పెట్టింది. ఆ మధ్య కాస్త బొద్దుగా ఉన్న ఇనయ ఇప్పుడు సన్నజాజి తీగలాగా మారింది.. జిమ్ లో కష్టపడుతున్న వీడియోలను కూడా ఆమె షేర్ చేస్తూ వచ్చింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే స్టార్ హీరోల సినిమాలలో నటించాలన్న కోరిక ఇంకా తీరలేదని ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఇకపోతే ప్రస్తుతం పెళ్లి చేసుకొనే ఉద్దేశాలు లేవని చెప్పేసింది. మరి సోషల్ మీడియాలో ఆమె చేసే గ్లామర్ షోలను చూసిన చిత్ర నిర్మాతలు, దర్శకులు ఆమెకు మంచి సినిమాలలో అవకాశాలు ఇస్తారేమో చూడాలి..