Demon Pawan : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు టాప్ రియాలిటీ షో అంటే టక్కును గుర్తుచేపేరు బిగ్ బాస్.. ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పటికే తెలుగులో ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం 9 వ సీజన్ కోసం కంటెస్టెంట్లను వెతికే పనిలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే గత సీజన్లో హౌస్ లోకి కాంటెస్ట్ గా అడుగుపెట్టిన డిమాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు.. రీతు చౌదరితో ఆయన క్లోజ్ గా ఉండడం పై అనేక ట్రోల్స్ వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక ఇప్పుడు తన తండ్రి చనిపోయిన తర్వాత కూడా డిమాన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు.. తండ్రి చనిపోయాడు అన్న బాధ కూడా అతనికి లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టడంతో దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ డీమాన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఆ పోస్టు తర్వాత ట్రోల్స్ కి చెక్ పడుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ట్రోల్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
బిగ్ బాస్ సీజన్ 8 లో అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ అయ్యే హౌస్ లోకి అడుగుపెట్టిన పవన్ తన ఆట తీరుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. చివరి వరకు హౌస్ లో కొనసాగడంతో ఈయనే విన్నర్ గా నిలుస్తాడని అందరూ అనుకున్నారు.. కానీ చివరి వరకు పవన్ కొనసాగిన కూడా అతనికి అదృష్టం కలిసి రాక వెనుతిరిగి వచ్చాడు.. ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో సందడి చేస్తూ వస్తున్నాడు.. ఇటీవలే ఈయన తండ్రి మరణించిన విషయం తెలిసిందే.. అయితే తండ్రి మరణించి కేవలం కొద్ది రోజులు అయినా కూడా అతను చాలా నవ్వుతూ బయట తిరుగుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపించాయి.. ఆ కామెంట్స్ పై రియాక్ట్ అయిన డిమాన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం మరోసారి ట్రోల్స్ వినిపిస్తున్నాయి. డిమాన్, రీతూ ఇద్దరు ఫ్రెండ్స్ అంటూనే బయట బాగానే తిరుగుతున్నారు. నిజంగా ఫ్రెండ్స్ నా? త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారా? అసలు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ పై అతను ఎలా రియాక్ట్ అవుతారో అన్నది ఆసక్తిగా మారింది.
Also Read : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
సాధారణంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది జీవితం పూర్తిగా మారిపోతుంది. అనుకున్న దాని కంటే ఎక్కువగానే తమ క్రేజ్ ని పెంచుకునే అవకాశాలు వస్తూనే ఉంటాయి. కొంతమంది ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. మరి కొంతమంది మాత్రం ఎటువంటి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటారు.. ఈమధ్య బిగ్ బాస్ కంటెస్టెంట్ల పరిస్థితి కొందరికి దారుణంగా మారింది అని చెప్పాలి. డిమాన్ పవన్ కు మాత్రం దశ తిరిగిందని చెప్పాలి.. చిన్న చిన్న యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఉండే ఈయన ఇప్పుడు సినిమాలలో నటించే అవకాశాలను అందుకుంటున్నాడని తెలుస్తుంది.. మొత్తానికి చేతినిండా సినిమాలతో బిజీ అయ్యేందుకు డిమాన్ ప్రయత్నాలు చేస్తున్నాడు..