E-Paper
Advertisement

15 ఏళ్ల వయసులోనే ఆ వెబ్‌సైట్‌లో తన ఫోటోలు చూసిన జాన్వీ రియాక్షన్ ఇదే..

15 ఏళ్ల వయసులోనే ఆ వెబ్‌సైట్‌లో తన ఫోటోలు చూసిన జాన్వీ రియాక్షన్ ఇదే..
Advertisement

Janhvi Issue: సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ ఎంత ఉంటుందో, దాని వెనుక ఉండే చీకటి కోణాలు కూడా అంతే భయంకరంగా ఉంటాయని నటి జాన్వీ కపూర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన టీనేజ్ వయసులో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి మరియు ప్రస్తుత పాపరాజీల తీరు గురించి ఘాటుగా స్పందించారు.

Read also-Red Bag: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘ది రెడ్ బ్యాగ్’.. ఈ లుక్ పోస్టర్ చూశారా?

మార్ఫింగ్ ఫోటోల వేధింపు

Advertisement

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. “నాకు కేవలం 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, నా ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేసి ఒక పోర్న్ సైట్‌లో పెట్టారు. ఆ సమయంలో నేను స్కూల్‌లో ఉన్నాను. అక్కడ అందరూ నా ఫోటోల గురించి మాట్లాడుకోవడం, నన్ను ఒక రకమైన చూపుతో చూడటం గమనించినప్పుడు నా గుండె పగిలినంత పనైంది. లోలోపల ఎంతో భయపడ్డాను, వణికిపోయాను” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన తనను మానసికంగా ఎంతో కలచివేసిందని ఆమె పేర్కొన్నారు.

ఫోటోగ్రఫర్లపై ఆగ్రహం

మహిళా సెలబ్రిటీల పట్ల ఫోటోగ్రాఫర్లు ప్రవర్తించే తీరును జాన్వీ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా కెమెరాలను బాడీ పార్ట్స్‌పైకి జూమ్ చేయడంపై ఆమె మండిపడ్డారు. “ఒక మహిళ కారు ఎక్కుతున్నప్పుడు లేదా వంగుతున్నప్పుడు కెమెరాలను జూమ్ చేసి షూట్ చేయడం ఏ రకమైన పద్ధతి? మీరు తీసే ఆ వీడియోలు చూసేవారికి అసభ్యకరంగా అనిపిస్తాయి. అది ఆ మహిళను కేవలం ఒక వస్తువులా చూడటమే తప్ప మరేమీ కాదు” అని ఆమె ఘాటుగా విమర్శించారు.

Advertisement

Read also-డెకాయిట్ సినిమాలో స్టార్ హీరో మేనకోడలు.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

తల్లి చెప్పిన మాటలు

తన తల్లి, అతిలోక సుందరి శ్రీదేవి తనను ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండాలని కోరేవారని జాన్వీ గుర్తు చేసుకున్నారు. “నువ్వు వేసుకునే దుస్తులు లేదా ఇచ్చే పోజుల వల్ల ఎవరైనా నిన్ను తప్పుగా చూసే అవకాశం ఇవ్వకు అని అమ్మా ఎప్పుడూ చెప్పేది. అప్పట్లో ఆమె ఎందుకు అంత కఠినంగా ఉండేవారో అర్థం కాలేదు కానీ, ఇప్పుడు సమాజంలోని పరిస్థితులు చూస్తుంటే ఆమె మాటల్లోని అర్థం తెలుస్తోంది” అని జాన్వీ వివరించారు. సెలబ్రిటీల లైఫ్ స్టైల్ కవర్ చేసే క్రమంలో వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించకూడదని జాన్వీ విజ్ఞప్తి చేశారు. మహిళల పట్ల ఫోటోగ్రాఫర్లు హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Related News

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ నుంచి స్పెషల్ ట్రీట్!

రూ.200 కోట్ల క్లబ్ లోకి ఇరుముడి.. అయ్యప్పగా మణెమ్మ!

టాక్సిక్ vs ఇరుముడి.. భారీ బడ్జెట్ సినిమాలకు ఇదో గుణపాఠమా?

Big Stories

Advertisement
×