Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ ల కంటే లవ్ ట్రాక్ లతో బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది. గత నాలుగు సీజన్ల నుంచి ఈ లవ్ ట్రాక్ కు హౌస్ లో నడుస్తున్నాయి. ఇక ఆ జంటల పై రూమర్స్ రావడం కొత్తేమి కాదు. ప్రతి సీజన్ లోనూ ఏదొక లవ్ స్టోరీ బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది. అలాగే విమర్శలను కూడా అందుకుంటుంది. ఈ లవ్ సోర్టీస్ కోసమే బిగ్ బాస్ ను చూసే ఫ్యాన్స్ ఉంటారంటే అతిశయోక్తి కాదు. అలా ఇప్పుడు కూడా ఓ ప్రేమ జంట బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. వారే పృద్వి- విష్ణు ప్రియ.. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య లోకి మరొకరు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఒక్కరు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
విష్ణు ప్రియకు పృథ్వీ అంటే ఎంత ఇష్టమో గత కొన్నివారాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే మొన్న జరిగిన నామినేషన్ వల్ల పృథ్వీ కావాలనే విష్ణును దూరం పెట్టేసాడు.. అంతేకాదు విష్ణును కాదని ఆ పృథ్వీ నయని పావనితో క్లోజ్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఆమెతో పులిహోర కలిపేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ కి విష్ణు ప్రియ వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది. ఇక ఇద్దరి ఫెయిర్ కు ఫ్యాన్స్ ఉన్నారని దీపావళి స్పెషల్ షో రూమ్ హైపర్ ఆది కూడా బాంబు పేల్చాడు. అంతేకాదు.. నువ్వు బయటకు టైటిల్ తో వస్తావా? లేదా బావతో వస్తావా? అని నీ చెల్లెలు భయపడుతుందని అడగ్గా.. తాను రెండిటి తో వస్తానంటూ విష్ణు ప్రియ స్టన్నింగ్ రిప్లై ఇచ్చింది.
అలాగే వీరిద్దరి ప్రేమ గురించి స్పెషల్ సాంగ్స్ కూడా పాడారు.. కానీ ఇప్పుడు పృథ్వీ మాత్రం విష్ణు అంటే పడదు అన్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. గతవారం పృద్వి,విష్ణువుకి మధ్య గొడవ కావడంతో .. విష్ణును కావాలని పృథ్వి దూరం పెడుతున్నాడు. నాయిని పావనితో క్లోజ్ గా మూవ్ అవుతూ పులిహోరా కలుపుతున్నాడు ప్రుధ్వీ. మొత్తానికి ఎక్కవ సమయం పవనితోనే టైం స్పెండ్ చేస్తూ విష్ణు ప్రియకు ఇరిటేట్ చేస్తున్నాడు పృథ్వీ.. అంతేకాదు ఒకే కొబ్బరి బొండం లో నీళ్లు తాగడం కూడా విష్ణు ప్రియా చూసేసింది. దీంతో విష్ణు ప్రియ.. పృద్వి దగ్గరికి వచ్చి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. తనను దూరం పెట్టొద్దని, తనకు ఏం కావాలంటే అది ఇస్తానంటూ రిక్వెస్ట్ చేసుకుంది. లాస్ట్ వీక్ బ్రేక్ అప్ అయింది కదా అంటూ పృద్వి కూడా విష్ణుని టీజ్ చేశాడు.. విష్ణు నయనికి కనెక్ట్ అవ్వకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.. చివరకు ఎవరికీ పృథ్వీ కనెక్ట్ అవుతారో చూడాలి.. ఇక ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో చూడాలి..