BigTV English

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో మరో రచ్చ.. అతడు నామినేట్ చేస్తే ఎలిమినేట్?

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో మరో రచ్చ.. అతడు నామినేట్ చేస్తే ఎలిమినేట్?

Bigg Boss Telugu 8 : తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. ఈ షో తెలుగులో 8 వ సీజన్ ను మొదలు పెట్టింది. ఆరో వారం పూర్తి చేసుకుంది. వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చినా తర్వాత హౌస్ లో రచ్చ మాములుగా లేదు.. అయితే గత వారంకు గాను హౌస్ నుంచి యూట్యూబర్ కిర్రాక్ సీత హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఆమె ఎలిమినేట్ అవ్వడం పై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో మొదటి నుంచి స్ట్రాంగ్ గా ఉన్న ఈమె వెళ్లిపోవడం ఏంటి అని ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఇక వీక్ గా ఉన్న వాళ్లను పంపించకుండా ఇలా సీతను పంపించడం ఏంటని ప్రశ్నిస్త్తున్నారు.. ఇక తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హౌస్ లో అతడు నామినేట్ చేస్తే పక్కా ఎలిమినేట్ అవ్వాల్సిందే అనే సెంటిమెంట్ ఉంది అంటూ వార్త వినిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటో ఒక లుక్ వేద్దాం..


బిగ్ బాస్ హౌస్ లోకి పోయిన ఆదివారం ఎనిమిది మంది పాత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే… వాళ్లు హౌస్ లోకి వచ్చిన తర్వాత సందడి మాములుగా లేదు.. వాళ్లు చేసే రచ్చ అంతగా ఇంతా కాదు. అందులో టేస్టీ తేజా కూడా ఒకరు. గత వారం నామినేషన్స్‌లో తేజ సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడాడు. కరెక్ట్‌ పాయింట్లు చెప్తూ సీత, మణికంఠను నామినేట్‌ చేశాడు. అయితే మణికి ఒకే ఒక్క నామినేషన్‌ పడటంతో అతడు నామినేషన్స్‌ నుంచి సేవ్‌ అయ్యాడు.. సీత బలైంది. ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సీతకు ఏకంగా ఐదు పడటంతో నామినేషన్స్‌లోకి వచ్చింది. ఇప్పటికే సండే ఎపిసోడ్‌ షూటింగ్‌ కూడా పూర్తవగా సీత ఎలిమినేషన్‌ కూడా జరిగిపోయింది..

సిల్లి కారణాలతో హౌస్ లోని వాళ్లు నామినేట్ చేస్తున్నారు. గత సీజన్ లలో ఇలాంటి కారణాలతో ఎలిమినేట్ చేసిన వాళ్లు ఉన్నారు.. ఇప్పుడు టేస్టీ తేజా కూడా సిల్లి కారణంతోనే సీతను నామినేట్ చేశాడు. తేజ వచ్చీరాగానే సీతను నామినేట్‌ చేయడం, ఆమె ఎలిమినేట్‌ అవడం చూస్తుంటే ఈసారి కూడా సీజన్‌ 7లో జరిగింది రిపీట్‌ అయ్యేట్లు కనిపిస్తోంది. ఇది గమనించిన కొందరు నెటిజన్లు.. నెక్స్ట్‌ వీక్‌ తేజ ఎవర్ని ఎలిమినేట్‌ చేస్తాడో చూడాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. మా కంటెస్టెంట్ తేజా చేతికి చిక్కకుండా ఉండాలని కోరుకుంటున్నారు.. ఇక ఈ వారం నామినేషన్స్ ఈరోజు రేపు జరగనున్నాయి. మరి తేజా చేతిలో ఎవరు నామినేట్ అవుతారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.. ఇక ఆదివారం ఎపిసోడ్ లో అందరు వైల్డ్ ఎంట్రీ ఇచ్చిన వారికే నాగ్ సపోర్ట్ చేసారని తెలుస్తుంది. ఇక సీజన్ విన్నర్ ఎవరో అనే దానిపై ఇప్పటి నుంచే ఆశక్తి పెరిగిపోయింది..


 

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×